మీ భార్యకు బంగారు భవిష్యత్తు అందించే స్కీమ్‌.. నెలకు రూ.1,000 ఇన్వెస్ట్‌ చేస్తే చాలు!

www.mannamweb.com


చాలా మంది రిటైర్‌ అయిన తర్వాత సుఖంగా, సురక్షితంగా బతకాలని కోరుకుంటారు. పని చేయలేని వయసులో అవసరాలకు తగిన ఆదాయం వచ్చేలా జాగ్రత్త పడతారు.
ముందు నుంచే రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడుతుంటారు. మీరు కూడా ఇలాంటి పెట్టుబడి పథకం కోసం వెతుకుతుంటే, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) మీకు బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. దీంట్లో మీ భార్య పేరు మీద కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఇలా పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టడమే కాకుండా, జీవితానికి స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు.

* NPS ఫీచర్లు
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది రిటైర్‌మెంట్‌ సేవింగ్స్‌ స్కీమ్‌. ఇందులో రెండు ప్రధాన దశలు ఉంటాయి. సంపద కూడబెట్టడం, విత్‌డ్రా చేసుకోవడం. మీరు 18 సంవత్సరాల వయస్సు నుంచి 75 సంవత్సరాల వరకు NPSలో పెట్టుబడి పెట్టవచ్చు. మీకు 60 ఏళ్లు వచ్చినప్పుడు, మీరు మీ సేవింగ్స్‌లో కొంత భాగాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన అమౌంట్‌తో మీకు మంత్లీ పెన్షన్‌ అందించే యాన్యుటీ ప్లాన్‌ కొనుగోలు చేయవచ్చు. మీ భార్య పేరు మీద NPS అకౌంట్‌ ఓపెన్‌ చేసి, ఆమె ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయవచ్చు, మనశ్శాంతి పొందవచ్చు.

* ఈ స్కీమ్‌ ఎలా పని చేస్తుంది?

– మీరు రూ.1,000 ప్రారంభ డిపాజిట్‌తో మీ భార్య పేరు మీద NPS అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు.

– మీరు మీ సౌకర్యాన్ని బట్టి నెలవారీ లేదా సంవత్సరానికోసారి డబ్బును డిపాజిట్ చేయవచ్చు. ఉదాహరణకు నెలకు రూ.5,000 అందించడం ద్వారా సంవత్సరానికి రూ.60,000 వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

– మీ డబ్బు క్రమంగా పెరుగుతుంది, కాంపౌండ్‌ ఇంట్రెస్ట్‌తో మంచి రిటర్న్స్‌ అందుతాయి. NPS పెట్టుబడులకు సాధారణంగా సంవత్సరానికి 12% రిటర్న్స్‌ లభిస్తాయి.

– మీ భార్యకు 60 ఏళ్లు వచ్చినప్పుడు NPS అకౌంట్‌ మెచ్యూర్ అవుతుంది. అయితే అవసరమైతే దాన్ని 65 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. మెచ్యూరిటీ సమయంలో డబ్బులో కొంత విత్‌డ్రా చేసుకోవచ్చు, మిగిలిన మొత్తాన్ని రెగ్యులర్‌ పెన్షన్‌గా మార్చుకోవచ్చు.

* భారీ లాభాలు
మీ భార్య వయస్సు 30 సంవత్సరాలు అనుకుందాం. మీరు ఆమె NPS అకౌంట్‌లో నెలకు రూ.5,000 పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నారని భావిస్తే..

మీ మంత్లీ కాంట్రిబ్యూషన్‌: రూ.5,000
సంవత్సరానికి: రూ.60,000
మొత్తం పెట్టుబడి (30 సంవత్సరాలు): రూ.18,00,000

ఇప్పుడు, యావరేజ్‌ వడ్డీ రేటు 12% అనకుంటే, పెట్టుబడి కాలక్రమేణా గణనీయంగా పెరుగుతుంది:

60 సంవత్సరాల వయస్సులో:
మొత్తం కార్పస్: రూ.1,76,49,569
సంపాదించిన వడ్డీ: రూ.1,05,89,741

అంటే భవిష్యత్తులో మీ మొత్తం సంపద దాదాపు పదిరెట్లు పెరుగుతుంది.

* అకౌంట్‌ ఎలా ఓపెన్‌ చేయాలి?
అకౌంట్‌ తెరవడానికి అధికారిక NPS వెబ్‌సైట్ లేదా సమీపంలోని పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (PoP)ని విజిట్ చేయండి. ఆధార్, పాన్ కార్డ్, అడ్రస్‌ ప్రూఫ్‌ వంటి అవసరమైన డాక్యుమెంట్స్ అందించండి. అకౌంట్‌ ఓపెన్‌ అయ్యాక మంత్లీ లేదా యాన్యువల్లీ క్రమం తప్పకుండా డబ్బు పెట్టుబడి పెట్టండి.

* NPS ఎందుకు ఎంచుకోవాలి?
మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి, పదవీ విరమణ తర్వాత మీకు ఎంత నెలవారీ పెన్షన్ కావాలో నిర్ణయించుకోవచ్చు. NPS ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్లు 80C, 80CCD కింద మంచి పన్ను ప్రయోజనాలు అందిస్తుంది. వృద్ధాప్యంలో మీ భార్యకు స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది, ఆర్థిక చింతలను తొలగిస్తుంది.