ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ జరుగుతోంది.ఆయా ఫ్రాంఛైజీల్లో ఓనర్లుగా సెలబ్రిటీలున్నారు. ఉదాహరణకు పంజాబ్ ఓనర్‌గా ప్రీతి జింటా ఉండగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓనర్‌గా షారుఖ్‌ఖాన్, హైదరాబాద్ ఓనర్‌గా కావ్యా మారన్ ఉన్నారు.
ఇక ముంబై ఇండియన్స్ జట్టు యాజమాన్యం ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరు. అయితే బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఒక తెలుగు వ్యక్తి ఢిల్లీ క్యాపిటల్స్ యజమానిగా ఉన్నారన్న విషయం తెలుసా.ఈయన పై ఫోకస్ ఎక్కువగా ఐపీఎల్ వేలం సమయంలోనే ఉంటుంది. మనిషి చూడటానికి చాలా నిండుగా ఉండటమే కాకుండా మొహంపై చిన్నపాటి చిరునవ్వుతో చాలా కూల్‌గా కనిపిస్తారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. ఆయనే మన గ్రంధి కిరణ్ కుమార్.
గ్రంధి కిరణ్ స్ట్రాటజీ మామూలుగా లేదుగా..
గ్రంధి కిరణ్ కుమార్.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్. వేలం సమయంలో ఒక రెండు జట్ల మధ్య ఒక ఆటగాడికోసం తీవ్రంగా పోటీ నెలకొని అందులో ఒకరు పోటీనుంచి తప్పుకుంటే మిగిలిన ఆ ఒక్క టీమ్‌ను రెచ్చగొడతారు. గ్రంధి కిరణ్ కుమార్ రంగంలోకి దిగి ఆటగాడి కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. కొంత దూరం వరకు లాక్కొచ్చి గ్రంధి కిరణ్ కుమార్ తెలివిగా పోటీ నుంచి తప్పుకుంటారు. దీంతో ఒక రేటుకు అమ్ముడుపోవాల్సిన ఆటగాడు మరో భారీ ధరకు అమ్ముడుపోతాడు. ఇలా చేయడం వల్ల కిరణ్ కుమార్ అవతల ఫ్రాంఛైజీ పర్సును ఖాళీ చేయిస్తారు. ఇలా చాలా సార్లు జరిగింది. మరి తెలుగోడి తెలివి మామూలుగా ఉండదుగా.
ఇక ఐపీఎల్ 2025 ఆక్షన్ వేల కూడా సరిగ్గా ఇదే జరిగింది. శ్రేయాస్ అయ్యర్ కోసం పంజాబ్ ఓనర్ ప్రీతి జింటాతో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బిడ్డింగ్ వార్‌కు దిగారు. ఏకంగా పంజాబ్ పర్సును రూ.26.7 కోట్లు ఖాళీ చేయించి శ్రేయాస్ అయ్యర్ పై ఖర్చు చేయించారు గ్రంధి కిరణ్.ఐపీఎల్ చరిత్రలో ఇదొక రికార్డు. అయితే కొన్ని క్షణాల్లోనే ఈ రికార్డు పంత్ బ్రేక్ చేశాడు. రూ.27 కోట్లకు అమ్ముడుపోయి కొత్త చరిత్ర సృష్టించాడు.అర్షదీప్ సింగ్ విషయంలో కూడా రూ.18 కోట్ల వరకు తీసుకొచ్చి సైడైపోయ్యారు.చివరకు స్టార్ ఆటగాడైన స్టార్క్‌ను రూ.11.75 కోట్లకు డెడ్ చీప్ రేట్లో కొనేశాడు.
గ్రంధి కిరణ్ కుమార్ ప్రస్తానం
ఇక గ్రంధి కిరణ్ కుమార్ విషయానికొస్తే ఆయన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఛైర్మెన్‌గా,సహ యజమానిగా ఉన్నారు.గ్రంధి మల్లికార్జున రావు చిన్న కుమారుడు గ్రంధి కిరణ్.జీఎంఆర్ గ్రూప్ బోర్డులో 1999 నుంచి కీలక బాధ్యతలు చేపడుతున్నారు.జీఎంఆర్ చేపట్టే పలు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో కీలకంగా పనిచేస్తున్నారు గ్రంధి కిరణ్ కుమార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్న జీఎంఆర్ గ్రూప్‌లో కీలక వ్యక్తి గ్రంధి కిరణ్ కుమార్. పలు అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంలో బిడ్డింగ్‌కు వెళ్లి వాటిని సాధించుకోవడంలో గ్రంధి కిరణ్ వ్యూహ రచన చాలా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, ఇస్తాంబుల్, మాలే లాంటి అంతర్జాతీయ విమానాశ్రయాల అభివృద్ధిలో గ్రంధి కిరణ్ కుమార్ భాగస్వామ్యం ఉంది.
ఇక ఇవే కాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ & హైవేస్ మాజీ ఛైర్మెన్‌గా పని చేసిన గ్రంధి కిరణ్ కుమార్ 12000 కిలోమీటర్ల మేరా హైవేల నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత జీఎంఆర్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు.అక్కడి నుంచి జీఎంఆర్ గ్రూప్ దృష్టిని క్రమంగా క్రీడా రంగం వైపు మరల్చారు.ఐపీఎల్లో అప్పటి ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టును కొనుగోలు చేసి దాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చి ఇప్పుడు సహ యజమానిగా కొనసాగుతున్నారు గ్రంధి కిరణ్.