మన ఆలోచనా సామర్థ్యాలను మెరుగుపరచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్ మీడియా ప్రాచుర్యం పెరిగాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు, పజిల్స్ విరివిగా వ్యాప్తి చెందుతున్నాయి.
అనేక తరాలుగా అన్ని వయస్సుల వారికీ ఈ పజిల్స్ మానసిక ఆనందాన్ని కలిగిస్తున్నాయి. వాటిని పరిష్కరించినప్పుడు లభించే సంతృప్తి అసాధారణమైనది. పజిల్స్‌ను తరచుగా పరిష్కరించడం ద్వారా మీ మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాధించడం వంటి ప్రక్రియలు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడంలో మాకు సహాయపడతాయి. పజిల్స్ (Puzzles), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusions) మీ మెదడు సామర్థ్యానికి ఒక సవాల్‌గా నిలుస్తాయి.
సోషల్ మీడియా యుగంలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫోటోలు, పజిల్స్ ఇప్పుడు చాలా ప్రాచుర్యం పొందాయి. ప్రస్తుతం అలాంటిదే ఒక ఫోటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకన్ల లోపల ఈ పజిల్‌ను సాధించగలిగారు. మీరు కనుగొనగలిగారా? అయితే అభినందనలు! కనుగొనలేకపోతే, ఈ క్రింది ఫోటోను పరిశీలించండి. ఫ్యాన్, షర్టు ధరించి పొడవుగా ఉన్న వ్యక్తే దొంగ. అతని జేబులో ఉన్న కళ్లజోడుపై ధర ట్యాగ్ కూడా కనిపిస్తోంది. బిల్లు చెల్లించకుండానే అతను దాన్ని జేబులో పెట్టుకున్నాడు.