రూ.10 వేలకే ఐకూ 5జీ ఫోన్‌.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ

www.mannamweb.com


IQOO Z9 Lite | ఇంటర్నెట్‌ డెస్క్: ఐకూ మరో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఐకూ జెడ్‌9 లైట్‌ పేరిట దీన్ని తీసుకొచ్చింది. మీడియాటెక్‌ డైమెన్సిటీ ప్రాసెసర్‌, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీతో వస్తోంది.

భారత్‌లో రూ.10వేల ధరల శ్రేణిలో లభిస్తోన్న అతికొన్ని 5జీ ఫోన్లలో ఇదొకటి. ఇతర ఫీచర్లు, వేరియంట్లు, ధర వంటి వివరాలు చూద్దాం.

ఐకూ జెడ్‌9 లైట్‌ ఫీచర్లు..

ఐకూ జెడ్‌9 లైట్‌ (iQOO Z9 Lite) 5జీ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 14తో వస్తోంది. ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్‌ రంగుల్లో లభిస్తోంది. 90Hz రీఫ్రెష్‌ రేటు, 840 నిట్స్‌ బ్రైట్‌నెస్‌తో 6.57 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇచ్చారు. వెనక f/1.8 అపెర్చర్‌తో కూడిన 50MP + 2 MP ప్రధాన కెమెరా, ముందుభాగంలో 8MPతో సెల్ఫీ కెమెరా ఇచ్చారు. వైఫై 5, బ్లూటూత్‌ 5.4, టైప్‌- సి యూఎస్‌బీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. యాక్సిలరోమీటర్‌, యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్‌, ఈ-కంపాస్‌, సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ వంటి ఆప్షన్లూ ఉన్నాయి. 15W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని పొందుపర్చారు. ఫొటో ఎడిటింగ్‌లో కొన్ని ఏఐ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఐకూ జెడ్‌9 లైట్‌ ధర..

ఐకూ జెడ్‌9 లైట్‌ (iQOO Z9 Lite) 5జీ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4 GB+ 128 GB ధర రూ.10,499. 6 GB+ 128 GB ధర రూ.11,499. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసినవారికి రూ.500 తక్షణ రాయితీ లభిస్తుంది. జులై 20 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌తో పాటు ఐకూ ఈస్టోర్‌, ప్రధాన రిటైల్ ఔట్‌లెట్ల నుంచి ఈ ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు