IranAttack: డేంజర్‌ బెల్స్‌.. ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాంబుల వర్షం

www.mannamweb.com


ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు మొదలయ్యాయి. దాదాపు రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ఇరాన్‌ ప్రయోగించింది. దీంతో, రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.

ఇక, ఇరాన్‌ దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే.

కాగా, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడులు ప్రారంభించింది. ఆకాశంలో ఇజ్రాయెల్‌వైపుగా రెండు వందలకుపైగా డ్రోన్స్‌, మిస్సైల్స్‌ను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. ఇక, ఈ డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌ గగనతలంలోకి రాగానే సైరన్‌ శబ్ధంతో అట్టుడుకుపోయింది. అయితే, వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్‌ మీదుగా ఇజ్రాయెల్‌ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, లెబనాన్‌, ఇరాక్‌ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్‌ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి. ఇరాన్‌లో డ్రోన్‌ దాడుల్లో ఒక బాలిక గాయపడినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. ఇరాన్‌ నుంచి వచ్చే డ్రోన్స్‌ ఇజ్రాయెల్‌కు రావడానికి గంటల కొద్దీ సమయం పడుతుందిని వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు.. ఇరాన్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ దేశానికి సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను మోహరించింది