IRCTC: మీ రైలు ఎక్కడుందో సులభంగా తెలుసుకోండి.. వాట్సప్ లో ఇలా మెసేజ్ చేస్తే చాలు..

www.mannamweb.com


IRCTC: భారతీయ రైల్వే సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకుంటూ ప్రయాణీకులు సేవలను అందుబాటులోకి తెస్తుంది. అలాగే మరికొన్ని సేవలను పొందే విధానాన్ని సులభతరం చేస్తోంది.
ఇప్పటికే ప్రయాణీకులు రిజర్వేషన్ చేసుకున్న టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంటే దాని పీఎన్ ఆర్ ఆధారంగా రైల్వే అధికారిక వెబ్ సైట్స్ తో పాటు మరికొన్ని వెబ్ సైట్లు, రైల్వే శాఖకు సంబంధించి యాప్ ల ద్వారా తెలుసుకునే వీలుంది. అలాగే వాట్సప్ ద్వారా కూడా మన పీఎన్ ఆర్ స్థితిని తెలుసుకుని వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈసేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనం ప్రయాణిస్తున్న లేదా.. ప్రయాణించబోయే రైలు ఎక్కడ ఉందనే కరెక్ట్ లోకేషన్ ను తెలుసుకోవడానికి ఎప్పటినుంచో యాప్ అయితే అందుబాటులో ఉంది. ఇప్పుడు వాట్సప్ సేవలను కూడా భారతీయ రైల్వే అందిస్తోంది. మన రైలు నెంబర్ ఎంటర్ చేసి రైల్వే శాఖ సూచించిన పద్ధతి ప్రకారం మెసేజ్ చేస్తే రైలు ఎక్కడ ఉందనేది తెలుసుకోవచ్చు. గతంలో మన రైలు నిర్థిష్టంగా ఎక్కడ ఉందనేది తెలుసుకోవడం కష్టంగా ఉండేది. తీరా రైల్వే స్టేషన్ కు కంగారు కంగారుగా టైమ్ కి చేరుకుంటే.. ఆతర్వాత ఎంక్వైరీలో అడిగితే రైలు లేటు నడుస్తుందని చెప్తే నిరాశకు గురయ్యేవారు ప్రయాణీకులు. అయితే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో కొన్ని సంవత్సరాల క్రితమే భారతీయ రైల్వే ఓ యాప్ ద్వారా రైలు ఎక్కడ ఉంది.. సరైన సమయానికి నడుస్తుందా లేదా ఆలస్యంగా నడుస్తుందా అని తెలుసుకునే విధానాన్ని ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

రైలు నెంబర్ ఆధారంగా ప్రయాణీకులు తాము ప్రయాణించే రైలు ఎక్కడుందో తెలుసుకుని దాని ఆధారంగా రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. దీంతో ప్రయాణీకుల సమయం ఆదా అవుతుంది. రైలు ప్రయాణం సమయంలో సరైన భోజనం చేయాలంటే ఇబ్బంది పడేవాళ్లు ప్రయాణీకులు. రైలులో ఏది దొరికితే అదే తినాల్సి వచ్చేది. అది కూడా ప్యాంటీకార్ సర్వీస్ సిబ్బంది ఆహారం తీసుకొస్తేనే వారి నుంచి కొనుగోలు చేసే వారు ప్రయాణీకులు. కాని ఇప్పుడు తమకు కావల్సిన ఆహారాన్ని ఓ మెసెజ్ లేదా యాప్ లో ఆర్డర్ చేయడం ద్వారా పొందే సదుపాయాన్ని భారతీయ రైల్వే కల్పించింది. ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి వాట్సప్ సేవలను కూడా భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్ సీటీసీ ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

వాట్సప్ లో భారతీయ రైల్వే తీసుకొచ్చిన చాట్ బాట్ ద్వారా రైల్వే ప్రయాణీకులు పీఎన్ ఆర్ స్థితితో పాటు రైలు యొక్క లోకేషన్ ను తెలుసుకోవచ్చు. ఏ రైల్వే స్టేషన్ కు ఏ సమయానికి చేరుకుంది. రైలు అంతకుముందు ఏ స్టేషన్ లో ఆగింది. తరువాత రాబోయే స్టేషన్ వివరాలను వాట్సప్ చాట్ బాట్ లో పొందవచ్చు. అలాగే వాట్సప్ సదుపాయం లేని వారు రైల్వే సహాయ కేంద్రం నెంబర్ 139కు డయల్ చేసి రైలు ఎక్కడుంది, తరువాత రాబోయే స్టేషన్ వివరాలతో పాటు, పీఎన్ ఆర్ స్థితిని తెలుసుకోవచ్చు. వాట్సప్ ద్వారా భారతీయ రైల్వే అందించే సేవలు ఎలా పొందాలో తెలుసుకుందాం.

రైల్వే శాఖకు చెందిన వాట్సప్ చాట్ బాట్ నెంబర్ 9881193322 నెంబర్ ను మన ఫోన్ లో సేవ్ చేసుకోవల్సి ఉంటుంది.
వాట్సప్ యాప్ ఓల్డ్ వెర్షన్ అయితే దానిని అప్ డేట్ చేసుకోవల్సి ఉంటుంది.

వాట్సప్ లో కాంటాక్ట్ లిస్ట్ ను రిఫ్రెష్ చేయాలి.

మనం ఫోన్ లో భారతీయ రైల్వేకు సంబంధించి వాట్సప్ సేవలను అందించే నెంబర్ ను ఏ పేరుతో సేవ్ చేసుకున్నామో అది ఓపెన్ చేసి అందులో హాయ్ అని మెసెజ్ చేయడం లేదా మన పీఎన్ ఆర్ లేదా రైలు నెంబర్ ను ఎంటర్ చేసినట్లయితే సేవలకు సంబంధించిన గైడ్ లెన్స్ ను పంపుతుంది. ఆ గైడ్ లైన్స్ ఫాలో అవడం ద్వారా మనకు కావల్సిన సేవలను పొందవచ్చు.
రైలులో ప్రయాణిస్తున్నప్పుడు రిజర్వేషన్ ఉన్న ప్రయాణీకులు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు. దీనికోసం ఐఆర్ సీటీసీకి చెందిన జూప్ యాన్ ని ఉపయోగించి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ఈయాప్ ద్వారా చేసే ఫుడ్ నేరుగా మన సీటు దగ్గరకే డెలివరీ చేస్తారు.

జూప్ ని ఉపయోగించి ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ముందుగా ఫోన్ లో వాట్సప్ చాట్ బాట్ నెంబర్ 702062070ని సేవ్ చేయాలి.

వాట్సప్ ఓపెన్ చేసి ఫుడ్ ఆన్ లైన్ ఆర్డర్ కు సంబంధించిన నెంబర్ ను ఏ పేరుతో సేవ్ చేశామో అది ఓపెన్ చేసి 10 అంకెల పీఎన్ ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆతర్వాత ఏ స్టేషన్ లో మనం ఫుడ్ పొందాలనుకుంటున్నామో ఎంపిక చేసుకోవాలి.
అలాగే ఏ రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రెస్టారెంట్ ని సెలక్ట్ చేసుకోవచ్చు.

ఆహారాన్ని ఆర్డర్ చేసిన తర్వాత ఆన్ లైన్ లో నగదు చెల్లించి లావాదేవీని పూర్తి చేసిన తర్వాత.. చాట్ బాట్ నుంచి ఆహారాన్ని ట్రాక్ చేయవచ్చు. ఇలా భారతీయ రైల్వేకు చెందిన ఐఆర్ సీటీసీ అందించే వాట్సప్ సేవలను రైల్వే ప్రయాణీకులు పొందవచ్చు.