AI Robot: క్లాస్‌రూమ్‌లో రోబో టీచింగ్ కిర్రాక్..! దెబ్బకు టీచర్లంతా షాక్..

Introducing IRIS, India’s first AI Teacher Robot, revolutionizes education with its interactive features and personalized learning experiences. Created by Maker Labs and unveiled at a school in Kerala, IRIS aims to redefine the learning landscape by harnessing the power of AI.


దేశానికి పాఠాలు నేర్పించే రంగమది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సెక్టారది. లీడర్లను తయారుచేసే వ్యవస్థ అది. అందుకే గురువులంటే అందరికీ అంత గౌరవం. టీచర్లంటే విద్యార్థులకు అంత వినయం. కానీ అలాంటి వ్యవస్థలో ఇప్పుడు తొలిసారిగా ఓ రోబో టీచర్ వచ్చింది.

దేశానికి పాఠాలు నేర్పించే రంగమది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే సెక్టారది. లీడర్లను తయారుచేసే వ్యవస్థ అది. అందుకే గురువులంటే అందరికీ అంత గౌరవం. టీచర్లంటే విద్యార్థులకు అంత వినయం. కానీ అలాంటి వ్యవస్థలో ఇప్పుడు తొలిసారిగా ఓ రోబో టీచర్ వచ్చింది. ఆమె పేరు ఐరిస్. లేటెస్ట్ ఏఐ టెక్నాలజీతో వేలాది మంది విద్యార్థులకు కూడా ఈజీగా పాఠాలు చెప్పేస్తుంది. వాళ్లు అడిగిన డౌట్స్ కు సమాధానాలు చెబుతుంది. ఇప్పటికే ఏఐ టెక్నాలజీ వల్ల సాఫ్ట్ వేర్ తోపాటు వివిధ రంగాల్లో ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మరి ఈ ఏఐ రోబో టీచర్ వల్ల విద్యావ్యవస్థలో జాబ్స్ పరిస్థితి ఏమిటి? టీచర్ల సంగతేంటి? అసలు రోబో టీచర్ వల్ల వ్యవస్థలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

ముందుగా ఈ ఏఐ రోబో టీచర్ అయిన ఐరిస్ గురించి చెప్పుకుందాం. కొచ్చికి చెందిన స్టార్టప్ సంస్థ.. మేకర్ ల్యాబ్స్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్లు దీనిని తయారుచేశారు. అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టులో భాగంగా ఇది రెడీ అయ్యింది. స్కూళ్లలో పిల్లలకు బూస్ట్ ఇచ్చేలా ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కోసం 2021లో నీతి అయోగ్ చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. తిరువనంతపురంలోని కేటీసీటీ స్కూల్లో ఈ ఏఐ టీచర్ తో పిల్లలకు పాఠాలు చెప్పించే ప్రయత్నం చేశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నిండైన చీరకట్టుతో ఉన్న ఈ టీచరమ్మను చూసి పిల్లలంతా ఒక్కసారిగా షాకయ్యారు. నిజం టీచరా.. రోబో టీచరా అని ఆశ్చర్యంగా చూశారు. ఆ టీచర్ పేరు ఐరిస్ అంట కదా.. అని ఒకరికొకరు చెప్పుకున్నారు. మొత్తానికి టీచర్ క్లాస్ రూమ్ లోకి రావడం.. పరిచయం చేసుకోవడం, పాఠాలు చెప్పడం.. ఇదంతా వారికి ఓ భ్రమలా అనిపించింది. కానీ అదంతా కొత్తగా ఉండడంతో ఆ టీచరు క్లాసు నచ్చిందోచ్ అన్నారు. దీంతో ఆ రోబోను తయారుచేసినవాళ్లు కూడా హ్యాపీగా ఫీలయ్యారు.