చేప మంచిదా? ఎండు చేప మంచిదా?

చేపలలో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా చెప్పాలంటే మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు అందుతాయి.


ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే చేపల్లో చాలా రకాలు ఉంటాయి. కానీ వీటిలో ఎండు చేపలు సైతం ఉంటాయి. మరి వీటిని తరచూ తినవచ్చా? లేదా? అంటే.. తినవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకుంటే అనేక లాభాలు ఉన్నాయని వారు వివరిస్తున్నారు.

ఎండు చేపలను ఉప్పు కలిపి ఎండలో ఎండబెడతారు. మరికొందరు వీటిని వేయించుకుని నిల్వ చేసుకుంటారు. ఈ చేపలను అధికంగా ఎండలో పెట్టడం వల్ల.. వాటిలోని నీరు పోతుంది. కానీ వాటిలోని పోషకాలు మాత్రం అలాగే పదిలంగా ఉంటాయని వివరిస్తున్నారు.

సూపర్ ప్రోటీన్లు..

ఎండు చేపల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిలో మంచి నాణ్యతతో కూడిన ప్రోటీన్లు ఉంటాయి. అదీకాక ఎండు చేపల్లో నీరు లేకపోవడంతో.. ప్రోటీన్ల పరిమాణం పెరుగుతుంది. పచ్చి చేపల కన్నా.. ఎండు చేపల్లోనే అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి. వీటిలోని ప్రోటీన్ల వల్ల కండరాలు బలంగా మారతాయి. కణజాలం సైతం వృద్ధి చెందుతుంది.

వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వివిధ రకాల జీవక్రియలు సైతం సక్రమంగా పని చేస్తాయి. అలాగే ఈ చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యం ఉంచుతాయి. మెదడు యాక్టివ్‌గా పని చేసేలా చేస్తాయి. అందువల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. అలసట కూడా దరి చేరదు. మెదడులో ఉండే వాపులు తగ్గడమే కాకుండా.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం సైతం తగ్గిస్తుంది.

ఎముకల బలానికి..

చేపలను ఎండబెట్టడం వల్ల వాటి ఎముకలు బలహీనంగా మారతాయి. ఈ క్రమంలో వాటి ఎముకలను నమిలి తినవచ్చు. దీంతో శరీరానికి కాల్షియం సమృద్ధిగా లభిస్తోంది. వీటిలో ఫాసర్పస్ సైతం ఉంటుంది. ఇవి ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. ఎండు చేపల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తికి సహయం చేస్తోంది.

దీని వల్ల రక్తం వృద్ధి చెందుతుంది. ఎండు చేపల్లోని హై క్వాలిటీ ప్రోటీన్లు ఉండడంతో.. అవి కొద్దిగా తింటేనే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆకలి వేయదు. తక్కువ ఆహారం తీసుకుంటారు. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ఈ నేపథ్యంలో నాన్ వేజ్ ప్రియులు తరచూ ఎండు చేపలు తింటే ప్రయోజనం అధికంగా ఉంటుంది.

ఈ జాగ్రత్తలు తప్పని సరి..

వీటిని నిల్వ చేసేందుకు ఫ్రిజ్ అవసరం లేదు. ఎంత కాలమైనా వీటిని బయట ఉంచవచ్చు. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. కనుక ఇవి అంత త్వరగా చెడిపోవు. కానీ వీటిలోని ఉప్పు కారణంగా.. సోడియం స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో హైబీపీ, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు ఉన్నారు.. వీటిని తీసుకోకపోవడమే ఉత్తమం. ఒక వేళ.. వీటిని తీసుకోవాలంటే.. ముందుగా వైద్యుడి సూచనలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.

ఇక ఎండు చేపలు ఎక్కడ కోనుగోలు చేస్తున్నామన్నది కూడా ముఖ్యమే. శుభ్రత లేని చోటు వీటిని కోనుగోలు చేస్తే.. వాటిల్లో క్రిములు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒక వేళ.. ఈ ఎండు చేపలు కొనుగోలు చేసినా.. వాటిని చాలా శుభ్రం చేసుకొని వండు కోవాల్సి ఉంటుంది. అయితే పచ్చి చేపలు తీసుకునే కంటే.. ఎండు చేపలు తీసుకోవడం వల్ల అధిక లాభాలున్నాయని స్పష్టమవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.