బాబోయ్.. స్మార్ట్‌ ఫోన్‌ల మొబైల్ కవర్‌ల కింద డబ్బులు దాస్తే ఇంత ప్రమాదమా?

www.mannamweb.com


Mobile back cover: బాబోయ్.. స్మార్ట్‌ ఫోన్‌ల మొబైల్ కవర్‌ల కింద డబ్బులు దాస్తే ఇంత ప్రమాదమా?

స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేని రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం జేబులో వాలెట్ పెట్టుకోవడమన్నా మర్చిపోతామేమో గానీ వెంట ఫోన్ తీసుకెళ్లడం మాత్రం అస్సలు మర్చిపోం.
ఈ క్రమంలో జనాలు స్మార్ట్‌ ఫోన్లను డబ్బులు దాచుకునే పర్సులుగా కూడా వాడేస్తున్నారు. చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లకున్న బ్యాక్ కవర్ కింద పదో పరకో దాచుకోవడం చూస్తూనే ఉంటాం(Keeping money in mobile back cover). అత్యవసరం సమయాల్లో డబ్బులు ఉంటాయని కొందరు ఇలా చేస్తే మరికొందరు మాత్రం తమకు తీపి గుర్తులుగా మిగిలిన నోట్లు ఇలా స్మార్ట్‌ఫోన్ల వెనకాల దాస్తుంటారు. అయితే, ఇలాంటి అలవాటు ఉన్నవారు తక్షణమే ఆ పని మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లో కూడా మైక్రోప్రాసెసర్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ వేగంగా పనిచేయాలంటే ఇది చాలా కీలకం. ఈ క్రమంలో మైక్రోప్రాసెసర్లు బోలెడంత ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఈ వేడితో అంతిమంగా మైక్రోప్రాసెసర్లకే ప్రమాదం కాబట్టి ఉష్ణం సెల్‌ఫోన్ నుంచి త్వరగా బయటకు వెళ్లేలా అందులో అనేక ఏర్పాట్లు ఉంటాయి. వీటికి అడ్డంకులు సృష్టిస్తే స్మార్ట్‌ఫోన్‌ల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి చివరకు అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ల వెనకాల దాచుకునే కరెన్సీ నోట్లు సరిగ్గా ఇలాంటి ప్రమాదాన్నే తెచ్చిపెడతాయి. వేడి బయటకు వేళ్లేమార్గం లేకపోవడంతో స్మార్ట్‌ఫోన్లలో వేడి(smartphone temparatures) పతాకస్థాయికి చేరుకుని అవి పేలిపోవచ్చని(Explosion) హెచ్చరిస్తున్నారు. కరెన్సీ తయారీలో రకరకాల రసాయనాలు వాడతారు కాబట్టి ఇలాంటి పేలుళ్లకు అవకాశాలు మరింత ఎక్కువనేది నిపుణులు అభిప్రాయం. కాబట్టి, ఇలాంటి అలవాటు ఉన్న వారు తక్షణం తమ పంథా మార్చుకోవాలని సూచిస్తున్నారు.