చాలా మందికి తీరిక లేక నిద్రపోయే ముందు బెడ్ పై వాలి స్మార్ట్ ఫోన్ లో వీడియోలు చూడడమో, సినిమాలు చూడ్డమో చేస్తూ ఉంటారు. కొంతమంది వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉంటారు. అయితే బెడ్ పై పడుకున్నప్పుడు చేత్తో పట్టుకుని ఎంతసేపని అలా ఉంటారు. దీని వల్ల చేతులు కూడా నొప్పి పుడతాయి. అందుకోసమే మార్కెట్లో పలు మొబైల్ హోల్డర్లు, ఫ్లోర్ స్టాండ్స్ అందుబాటులోకి వచ్చాయి. తక్కువ ధరకే అందుబాటులో ఉండడం వల్ల చాలా మంది వీటిని వినియోగిస్తున్నారు. ఇవాళ మీకు ఇలాంటి గాడ్జెట్స్ ని తీసుకొచ్చాము.
సోఫాలో పడుకున్నప్పుడు లేదా బెడ్ పై పడుకున్నప్పుడు తల పైకి ఉంటుంది. కానీ సెల్ ఫోన్ చేతిలో ఉంటే తల కింద ఎత్తుగా తలగడ పెట్టుకుని చూడాల్సి వస్తుంది. దీని వల్ల మెడ నొప్పి, నడుము నొప్పి కూడా వస్తాయి. అది అంత సౌకర్యంగా కూడా ఉండదు. ఈ సమస్యను దూరం చేయడానికే లేజీ టేబుల్ టాప్ అందుబాటులో ఉంది. ఇది 2.1 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఎత్తుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 360డిగ్రీల రొటేషన్ తో వస్తుంది. దీన్ని గూస్ నెక్ మొబైల్, ట్యాబ్లెట్ హోల్డర్ గా వాడుకోవచ్చు. ఫోటోషూట్ కోసం, వీడియో షూట్ కోసం వాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్ లెట్స్ కి సెట్ అయ్యేలా అడ్జస్ట్ మెంట్ హోల్డర్ ఉంది. ఫోన్ల కోసం 4 నుంచి 8 అంగుళాల హోల్డర్, 7 నుంచి 8 అంగుళాల సైజుతో ఒక హోల్డర్, 9 నుంచి 12.5 అంగుళాల హోల్డర్ ఇచ్చారు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 2,999 ఉండగా ఆఫర్ లో రూ. 1395 రూపాయలకే అందుబాటులో ఉంది.
ఇందులోనే కొంచెం తక్కువ ధర కలిగిన మొబైల్ బెడ్ హోల్డర్లు కూడా ఉన్నాయి. మెడలో ఆభరణంలా వేసుకునేవి ఉన్నాయి. లేజీ నెక్ ఫోన్ హోల్డర్, నెక్ హ్యాంగింగ్ మొబైల్ సెల్ ఫోన్ స్టాండ్ అందుబాటులో ఉంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 699 కాగా ఆఫర్ లో రూ. 315గా ఉంది. మెడలో వేసుకుని హ్యాపీగా ఫోన్ ని హోల్డర్ కి తగిలించుకుని రిలాక్స్డ్ గా వీడియోలు చూడచ్చు. ఈ నెక్ హోల్డర్ రింగ్ కూడా ఎలా కావాలంటే అలా ఫ్లెక్సిబిల్ గా బెండ్ అవుతుంది.
ఇంకా తక్కువ ధరలో ఉన్న మొబైల్ బెడ్ హోల్డర్ ఒకటి ఉంది. దీనికొక క్లిప్ లాంటిది ఉంటుంది. దాన్ని మంచానికి పెట్టి హోల్డర్ లో మొబైల్ పెట్టి హ్యాపీగా వీడియోలు చూసుకోవచ్చు. చేతుల నొప్పి ఉండదు. దీని అసలు ధర రూ. 739 కాగా ఆఫర్ లో రూ. 249కే అందుబాటులో ఉంది.