మగజాతి మనుగడకే ముప్పు పొంచి ఉందా

www.mannamweb.com


కొన్నాళ్ల తరువాత ఈ భూమిపై మగవారికి చోటు ఉండదా? అసలు మగవారే పుట్టరా? కేవలం మహిళలు మాత్రమే ఉంటారా? ఇలా వరుస ప్రశ్నలేంటి అనుకోవచ్చు. ఎందుకంటే శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో భయంకరమైన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. మేల్ క్రోమోజోమ్ గా పిలిచే వై క్రోమోజోమ్ త్వరలో అంతర్థానమవుతుందని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ప్రొసీడింగ్స్ లో పబ్లిష్ చేశారు. మగవారిలో రెండు క్రోమోజోమ్ లు ఉంటాయి. అవి.. ఒకటి ఎక్స్, మరొకటి వై. మహిళల్లో అయితే రెండు ఎక్స్ క్రోమోజోమ్ లు ఉంటాయి. నిజానికి ఇది ఎక్స్ క్రోమోజోమ్ తో పోలిస్తే.. చిన్నదే. కాకపోతే మగవారి పుట్టుకకు కారణం ఈ వై క్రోమోజోమే. బిడ్డ కడుపులో పిండ దశలో ఉండగానే వృషణాలు రూపుదిద్దుకునేలా కణాలను ప్రేరేపించడంలో దీనిది చాలా కీలక పాత్ర అని చెప్పాలి. ఆ తరువాత అవి పురుష హార్మోన్లను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అందుకే దీనిని సీక్వెన్స్ చేయడం కష్టమంటారు. కాకపోతే ఆ మధ్యన.. లాంగ్ రీడ్ టెక్నిక్ తో దీనిలోని జన్యువుల క్రమాన్ని శాస్త్రవేత్తలు డీకోడ్ అయితే చేయగలిగారు. మరి.. ఇది లేకపోతే.. మగ సంతానం ఉండదా? అదే జరిగితే.. మనిషి మనుగడ సాధ్యమేనా? అసలు.. శాస్త్రవేత్తల పరిశోధనలో ఎలాంటి రిజల్ట్ వచ్చింది? అలాగే SRY జన్యువును కలిగి ఉన్న వై క్రోమోజోమ్ అంతర్థానమైతే.. దానికి ప్రత్యామ్నాయం సంగతేంటి?