సాధారణంగా చెట్లు మనిషిని బతికిస్తాయి. వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ మనిషి బతకడానికి అవసరమవుతుంది. అలాగే కొన్ని చెట్ల నుంచి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు, చెట్ల బెరడు, చెట్ల రసం ద్వారా కూడా మనిషికి ప్రమాదం ఉన్నప్పుడు చికిత్స చేసి బతికిస్తారు.
అలాగే చెట్ల నుంచి వచ్చే ఆహరం కూడా మనిషి బతకడానికి దోహపడుతుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న చెట్లలో కొన్ని చెట్లు మనిషి ప్రాణాలనే తీసేస్తాయి.
ఈ ప్రపంచంలో అలాంటి చెట్లు కొన్ని ఉన్నాయి. ఈ చెట్ల ద్వారా మనిషి ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి చెట్టు గురించి ఈరోజు ఈ స్టోరీలో తెలుసుకుందాం. అసలు ఆ చెట్టు ఏంటి? ఆ చెట్టు ఎక్కడ పెరుగుతుంది?, ఆ చెట్టుతో ఎందుకు ప్రాణాలు పోతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మంచినీల్ చెట్టు..
ఈ ప్రాణాంతకమైన చెట్టు పేరు మంచినీల్ చెట్టు. పేరు చూసి ఇది మంచినీళ్ల చెట్టు అని అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇది ఒక విషపూరితమైన చెట్టు. ఇది ఒక పూల జాతికి చెందిన చెట్టు. ఈ చెట్టుకు మంజనీల్ల అనే స్పానిష్ పదం నుంచి మంచినీల్ అనే పేరు వచ్చింది. ఈ చెట్లు ముఖ్యంగా ఉత్తర-దక్షిణ అమెరికాలో కనిపిస్తుంటాయి. ఈ చెట్టుకు చిన్న చిన్న పండ్లు కాస్తాయి. ఇవి యాపిల్ మాదిరిగా కనిపిస్తుంటాయి. అందుకే ఈ చెట్టుకు బీచ్ యాపిల్ చెట్టు అని కూడా పిలుస్తుంటారు.
ఎందుకు ఈ చెట్టు విషపూరితం..
పూల జాతికి చెందిన ఈ చెట్టు ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన చెట్టుగా పేరుంది. ఎందుకంటే ఈ చెట్టు నుంచి పాల లాంటి ద్రవం వస్తుంది. ఈ ద్రవంలో ఎన్నో విషపూరితమైన, హానికారకమైన లక్షణాలు దాగి ఉన్నాయి. ఆ తెల్లని పాల ద్రవాన్ని తాకితే చాలు దద్దుర్లు, కురుపులు, చర్మంపై మంట వంటి సమస్యలు వచ్చేస్తాయి. ఈ చెట్టు ఆకుతో పాటు పండ్లలో కూడా ఈ తెల్లని ద్రవం వస్తుంది. ఈ విషపు పాలలో మనిషిని చంపేసే లక్షణాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ చెట్టు దగ్గరికి వెళ్లినా ప్రమాదమే.
ఈ చెట్టు కింద కొంచెం సేపు వెళితే ఇక అంతే. మెల్లిగా చర్మపై దద్దుర్లు, చర్మంపై మంట మొదలైపోతాయి. చర్మంపై దురద మొదలవుతుంది. పొరపాటున చెట్టు పాలు మీద పడితే చాలు.. మీ తట్టు లేవాల్సిందే. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో ఈ చెట్టు కింద ఎట్టిపరిస్థితుల్లో నిలబడకూడదు. ఎందుకంటే వర్షం చినుకులతో కలిసి ఈ చెట్టులోని ద్రవం మరింత విషపూరితంగా మారుతుంది. ఆ చినుకులు పొరపాటున మీ నోట్లో చేరితే మీ ప్రాణాలు పోయినట్లే. మనుషులకే కాదు వాహనాలకు కూడా ఈ చెట్టు ప్రమాదకరమే. ఈ చెట్టు కింద బైక్, లేదా కార్ పార్క్ చేసి వెళితే ఆ ద్రవం వాహనం అంతా నిండిపోతుంది. వాటిని తీసేసమయంలో పెయింట్ కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది.
అలాగే ఈ చెట్టును కాలిస్తే ఈ చెట్టు నుంచి వచ్చే పొగ కూడా ప్రమాదకరమే. ఆ పొగ పొరపాటున పీల్చినా శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పొరపాటున పొగ కంటికి చేరితే కనుచూపు పోతుంది. ఇంతటి ప్రమాదం ఉన్న ఈ చెట్టును దరి చేయడానికి కూడా సాహసం చేయకూడదు.
ఇంత వరకు ఎవరూ చనిపోలేదు..
అదృష్టమో, యాదృశ్చికమో ఇంతటి ప్రమాదకరమైన ఈ చెట్టు కారణంగా ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు. అలా జరగకుండా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ చెట్టుకు కాసిన పండును తింటే ముందు తియ్యగా అనిపిస్తాయి. తరువాత నోట్లో మంట మొదలవుతుంది. తరువాత గొంతుపట్టేసినట్లు అనిపిస్తుంది. క్రమంగా లక్షణాలు పెరిగి చనిపోతారు. అందుకే ఈ చెట్టు పాలను బాణాలకు అంటించి, లేదా పండును బాణాలకు కట్టి పూర్వం గిరిజనులు వన్య మృగాలను వేటాడేవారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.