చాలా వరకు స్మాల్ ఇష్యూస్ వల్లే మైలేజ్ డ్రాప్ అవుతుంటుంది. వీటిని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ బైక్ మైలేజ్ పెరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏం చేయాలి? వివరాలు చూద్దాం.
ఇండియాలో మోటార్‌సైకిల్స్ వాడే వారి సంఖ్య ఎక్కువ. చిన్న పనైనా, ఆఫీసుకైనా, బయట వెళ్లాలన్నా లేదా లాంగ్ డ్రైవ్ అయినా బైక్ స్టార్ట్ చేయాల్సిందే. అయితే అన్ని రకాల బైక్‌లు ఒకే రకమైన మైలేజ్ ఇవ్వవు. వెహికల్ కొనేటప్పుడే ఈ క్లారిటీ ఉంటుంది. కానీ ఇవ్వాల్సిన దానికన్నా తక్కువ మైలేజ్ (Bike mileage) వస్తుంటే మాత్రం తట్టుకోలేరు. ఉన్నట్టుండి మైలేజ్ డ్రాప్ అయితే ఓ వైపు చికాకు పుడుతుంది, మరోవైపు పాకెట్‌కి చిల్లు పడుతుంది. గుడ్‌న్యూస్ ఏంటంటే, చాలా వరకు స్మాల్ ఇష్యూస్ వల్లే మైలేజ్ డ్రాప్ అవుతుంటుంది. వీటిని సాల్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ బైక్ మైలేజ్ పెరుగుతుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? ఏం చేయాలి? వివరాలు చూద్దాం.
ఓల్డ్ లేదా డర్టీ ఇంజిన్ ఆయిల్ (Engine Oil)తో ఇంజిన్ హార్డ్‌గా పని చేస్తుంది. దీంతో ఫ్యూయల్ కన్జమ్షన్ పెరుగుతుంది. సమయానికి ఆయిల్ మార్చడం వల్ల ఇంజిన్ స్మూత్‌గా రన్ అవుతుంది. ఎయిర్ ఫిల్టర్ కూడా అంతే ఇంపార్టెంట్. అడ్డంకులు ఉన్న ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్‌కు గాలి సరఫరాను తగ్గిస్తుంది, కంబషన్‌ని ప్రభావితం చేస్తుంది. దాన్ని రెగ్యులర్‌గీ క్లీన్ లేదా రీప్లేస్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్, మైలేజ్ ఇంప్రూవ్ అవుతాయి.
రెగ్యులర్‌గా సర్వీస్ చేయించడం వల్ల మీ బైక్ హెల్తీగా ఉంటుంది. టైమ్‌కి సర్వీస్ చేయించనప్పుడు లేదా ఆలస్యం చేసినప్పుడు, ఇంజిన్ ఎఫిషియంట్‌గా పనిచేయదు. దీంతో ఫ్యూయల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, పార్ట్స్ వేగంగా అరిగిపోవచ్చు. మంచి మైలేజ్ ఇవ్వాలంటే మ్యానుఫ్యాక్చరర్ ఇచ్చిన సర్వీస్ షెడ్యూల్‌ని ఫాలో అవ్వండి.
అనవసరమైన సామాను లేదా భారీ వస్తువులు మైలేజీని తగ్గిస్తాయి, బ్యాలెన్స్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. మీకు అవసరం లేని వస్తువులను తీసివేయండి. వెయిట్ లేని బైక్ ఈజీగా మూవ్ అవుతుంది, ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది.
RPM హైగా ఉన్నప్పుడు డ్రైవ్ చేయడం వల్ల ఇంజిన్‌పై ఎక్స్‌ట్రా స్ట్రెస్ పడుతుంది. ఎక్కువ ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. అవసరమైతే తప్ప ఇంజిన్ రివ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బైక్ న్యూట్రల్‌లో ఉండి, యాక్సిలరేటర్‌ను తిప్పితే, ఇంజిన్ సౌండ్ ఎక్కువగా వస్తుంది. అది ఇంజిన్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. ఇలా న్యూట్రల్‌లో ఉన్నప్పుడు, గేర్లు మారుస్తున్నప్పుడు అనవసరంగా యాక్సిలేటర్ తిప్పితే ఎక్కువ ఫ్యూయల్ బర్న్ చేస్తుంది. బైక్‌లో స్టెడీ స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇంజిన్ కంఫర్టబుల్‌గా వర్క్ అయ్యేలా చూడాలి.
టైర్లలో గాలి తక్కువగా ఉంటే, రోడ్ ఫ్రిక్షన్ పెంచుతుంది. దీని అర్థం ఇంజిన్ ఎక్కువ ఫ్యూయల్ వాడాలి, ఎక్కువ కష్టపడి పనిచేయాలి. అందుకే బైక్ టైర్లను సరిపడా ఎయిర్ ప్రెజర్ ఉండేలా చూడండి.
రాంగ్ గేర్ వాడకం వల్ల ఫ్యూయల్ వేస్ట్ అవుతుంది. ఇంజిన్ ఒత్తిడికి గురవుతుంది. లో గేర్‌లో హై స్పీడ్ లేదా టాప్ గేర్‌లో లో స్పీడ్ వెళ్తే సామర్థ్యం తగ్గుతుంది. ఇంజిన్ సరిగా పని చేయాలంటే స్పీడ్‌కి తగినట్లు గేర్లు మార్చాలి.




































