మీ ముఖం జిడ్డుగా ఉంటుందా..? అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి

చర్మం ఎక్కువగా ఆయిలీగా ఉండటం వల్ల మొటిమలు, మచ్చలు, ఇతర సమస్యలు ఎదురవుతాయి. మార్కెట్‌లో అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నా.. సహజమైన ఇంటి చిట్కాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. చర్మం మృదువుగా మారి కాంతివంతంగా ఉండేందుకు కొన్ని సులభమైన టిప్స్ పాటించాలి. ఈ ఇంటి చిట్కాలతో మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.


గోరువెచ్చని నీరు
కొంతమంది ఎక్కువసార్లు ముఖాన్ని ఫేస్‌వాష్ లేదా సోప్‌తో కడుక్కుంటారు. ఇది మంచి అలవాటు కాదు. తరచూ రసాయనాలున్న ప్రొడక్ట్స్ వాడితే చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు రెండుసార్లు మాత్రమే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం మంచిది.

ఉప్పు కలిపిన నీరు
ఓ స్ప్రే బాటిల్ తీసుకుని కొద్దిగా నీటిలో ఉప్పు కలిపి నిల్వ చేసుకోవాలి. రోజులో ఒకసారి లేదా రెండుసార్లు ఈ నీటిని ముఖంపై స్ప్రే చేసుకుని ఆరనివ్వాలి. ఇది జిడ్డు తగ్గించడంలో సహాయపడుతుంది.

పాలు
పాలను ముఖానికి రాసి 15 నిమిషాల పాటు ఉంచి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన అవశేషాలు, జిడ్డు తొలగిపోతాయి. పాలు చర్మాన్ని సహజంగా క్లీన్ చేసి మృదువుగా మారేలా చేస్తాయి.

కొబ్బరి పాలు
కొబ్బరి పాలను ముఖానికి అప్లై చేసి 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అదనపు ఆయిల్ తగ్గుతుంది. కొబ్బరి పాలు చర్మానికి పోషణ అందించి తేమను సమతుల్యం చేస్తాయి.

తేనె
తేనె కూడా మంచి సహజమైన క్లెన్సర్‌. స్వచ్ఛమైన తేనెను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం తాజాగా మారుతుంది. తేనెలో ఉండే యాంటీబాక్టీరియల్ గుణాలు మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి.

నిమ్మరసం
ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి రోజుకు ఒక్కసారి ముఖాన్ని కడుక్కోవచ్చు. నిమ్మరసం సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేసి జిడ్డు తగ్గిస్తుంది. అంతేకాకుండా నిమ్మరసం కలిపిన ఐస్ క్యూబ్‌తో ముఖాన్ని మృదువుగా రుద్దితే చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఎగ్స్
గుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం, ద్రాక్షరసం మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. గుడ్డు చర్మాన్ని టైట్‌గా మారుస్తుంది, నిమ్మరసం మురికిని తొలగిస్తుంది, ద్రాక్షరసం చర్మాన్ని మృదువుగా మార్చుతుంది.

ఈ ఇంటి చిట్కాలను పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా, తాజాగా మారుతుంది. ప్రాక్టికల్‌గా ఫాలో అయ్యే ఈ సింపుల్ టిప్స్‌తో జిడ్డు సమస్యకు చెక్ పెట్టి, అందమైన, కాంతివంతమైన చర్మాన్ని పొందండి.