ఫాస్టాగ్‌లకు కేవైసీని తప్పనిసరి చేస్తూ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ రహదారులపై వాహనాలు టోల్ చెల్లించే విధానాన్ని సులభతరం చేస్తూ కేంద్రం దేశంలోని అన్ని టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ఫాస్టాగ్‌లకు కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకు గాను చివరి తేదీగా జనవరి 31వ తేదీని నిర్ణయించారు. ఒకే వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ విధానాన్ని తీసుకొచ్చింది. ఒకే ఫాస్టాగ్‌ను వేరు వేరు వాహనాలకు ఉపయోగించకుండా ఉండడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 31వ తేదీలోపు కేవైసీ చేసుకోకపోతే ఫాస్టాగ్ డీయాక్టివేట్ అవుతుందని ప్రకటించారు.
దీంతో వాహనదారులు తమ ఫాస్టాగ్‌కు కేవైసీని అప్‌డేట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉంటే ఇంతకీ మీరు ఉపయోగిస్తున్న ఫాస్టాగ్‌కు కేవైసీ అయ్యిందో లేదో ఆన్‌లైన్‌లో తెలుసుకునే అవకాశం ఉంది. ఇంతకీ ఆన్‌లైన్‌లో కేవేసీ స్టేటస్‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా ఫాస్టాగ్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం మీ మొబైల్ నెంబర్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
లేదంటే ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా కూడా లాగిన్ కావొచ్చు. అనతంరం డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ మీ ఫాస్టాగ్ కేవైసీ కాకపోయి ఉంటే.. అక్కడ అడిగిన వివరాలు సమర్పించాలి. దీంతో కేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవచ్చు.