మీ ఫోన్‌లో స్టోరేజీ ఫుల్ అయ్యిందా.. ఇలా ఈజీగా క్లియర్ చేయండి!

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరి బాధ స్టోరేజీ. మొబైల్ కొనే రోజు ఎంత సంతోష పడుతారో, ఆ ఫోన్‌లో స్టోరేజ్ అయిపోయినప్పుడు అంతకు రెట్టింపు బాధ పడుతారు.


అందుకే ఎవరైనా సరే మొబైల్ కొనే ముందే స్టోరేజ్ ఎంత ఉందో చూసి కొనుగోలు చేస్తారు. ఒక వేళ తక్కువ స్టోరేజ్ ఉన్న ఫోన్ తీసుకుంటే యాప్స్ ఇన్ స్టాల్ చేయడానికి, వీడియోస్, పీడీఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.
ప్రస్తుతం అందరూ 128 GB వున్న ఫోన్ తీసుకుంటున్నారు.దీంతో కొన్నేళ్ల వరకు స్టోరేజ్ సమస్య లేకపోయినా, ఆ తర్వాత మళ్లీ స్పేస్ ఖాళీ చేయడం కోసం ఇబ్బంది పడక తప్పడం లేదు. మొబైల్‌లో స్టోరేజ్ లేకపోవడం వలన ఇంపార్టెంట్ ఫైల్స్ డౌన్ లోడ్ చేయడానికి కొన్ని యాప్స్ డిలీట్ చేయడం లేదా కొన్ని ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

కాగా, మీ స్మార్ట్ ఫోన్‌లో కొంత స్పేస్ ఖాళీ చేసుకోవడానికి కొన్ని బెస్ట్ టిప్స్ ఉన్నాయి. అవి ఏమిటంటే?అనవసరమైన ఫైల్స్‌ను రిమూవ్ చేసుకోవడానికి, కొంత స్పేస్ క్లియర్ చేయడానికి ఫోన్‌లోని ఈ బిల్ట్-ఇన్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
దీని కోసం ముందుగా సెట్టింగ్స్‌కు వెళ్లి, స్టోరేజ్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీరు మొత్తం ఎంత స్పేస్ యూజ్ చేశారు, ఇంకా ఎంత స్పేస్ ఉంది. ఎంత స్పేస్ అనవసరంగా యూజ్ చేశారో తెలుస్తుంది. దాని బట్టి అక్కడ కనిపిస్తున్న ఫ్రీ అప్ స్పేస్ బటన్ పై నొక్కాలి. దీంతో ఫోన్‌లో గూగుల్ ఫైల్స్ యాప్‌ ఓపెన్ అయి, “క్లీన్” ఫీచర్‌ కనిపిస్తుంది.

ఈ ఫీచర్ డూప్లికేట్ ఫైల్స్‌, జంక్ ఫైల్స్‌, లార్జ్ ఫైల్స్‌ వంటి వాటిని రిమూవ్ చేసి ఫ్రీ స్పేస్ పొందడానికి వివిధ మార్గాలను సూచిస్తుంది. తొలగించాలనుకుంటున్న ఫైల్స్‌ను సెలెక్ట్ చేసుకుని “రిమూవ్”పై నొక్కవచ్చు.అలాగే ఫోన్‌లో ఉన్న ఓల్డ్ ఫైల్స్‌ లేదా వీడియోలను డిలీట్ చేయాలంట. మీ మొబైల్ ఫోన్‌లో ఉన్న యాప్స్ గేమ్స్ కూడా ఎంత స్పేస్ ఆక్రమిస్తున్నాయో తెలుసుకోవాలంట. దాని బట్టి ఎక్కువ స్పేస్ ఆక్రమించిన యాప్స్‌ను , గేమ్స్‌ను డిలీట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ ఫోన్‌లో కాస్త స్పేస్ ఖాళీ చేసుకోవచ్చు.