స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జి అవుతోందా.. ఈ సెట్టింగ్స్‌లో

స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేవలం కాలింగ్‌ కోసమే ఫోన్‌లు ఉపయోగించిన రోజుల నుంచి.. అనేక పనులు ఫోన్‌ ద్వారానే జరుగుతున్న రోజులు వచ్చేశాయి.

వెబ్‌ బ్రౌజింగ్‌, సోషల్‌ మీడియా, బ్యాంకింగ్‌ అవసరాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ వరకు అనేక రకాలుగా స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ యూజర్లలో చాలా మందికి బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జీ కావడం పెద్ద సమస్యగా ఉంది. ఇందుకు కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి.


* కొన్ని సమస్యల కారణంగా :

తక్కువ సామర్థ్యం కలిగిన బ్యాటరీలు, పాత స్మార్ట్‌ఫోన్‌లతోపాటు బ్యాటరీ త్వరగా డ్రెయిన్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో 7000mAh లేదా అంతకంటే అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీల స్మార్ట్‌ఫోన్‌ లు అందుబాటులోకి వస్తున్నా.. కొన్ని సమస్యల కారణంగా త్వరగా బ్యాటరీ డిశ్ఛార్జీ అవుతోంది.

* ఈ ఫీచర్లను ఆఫ్‌ చేయాలి :

స్మార్ట్‌ఫోన్‌లలోని 5G, బ్లూటూత్‌, వైఫై వంటి ఫీచర్లు బ్యాటరీ ఛార్జింగ్‌ ను అధికంగా ఉపయోగించుకుంటాయి. వీటిని అవసరం అయిన సందర్భాల్లో మాత్రమే ఆన్‌ చేసి, తర్వాత ఆఫ్‌ చేయడం ఉత్తమం. అదే సమయంలో 5G నెట్‌వర్క్‌ కూడా ఛార్జింగ్‌ ను అధికంగానే ఉపయోగించుకుంటుంది. హైస్పీడ్ డేటా అవసరం లేని సందర్భాల్లో.. 5G డేటా ను ఆఫ్‌ చేసుకోవాలి. 4G డేటాను ఉపయోగించుకోవాలి. ఫలితంగా బ్యాటరీ డ్రెయిన్‌ సమస్య కొంత వరకు పరిష్కారం అవుతుంది.

* స్మార్ట్‌ఫోన్‌ లొకేషన్‌ :

స్మార్ట్‌ఫోన్ లొకేషన్‌ సర్వీసులు కూడా బ్యాటరీని అధికంగా వినియోగించుకుంటాయి. అందువల్ల అవసరం లేని సమయాల్లో లొకేషన్ కచ్చితంగా ఆఫ్‌ చేసుకోవాలి. దీంతోపాటు బ్యాగ్రౌండ్‌ యాప్స్‌ కూడా ఫోన్ బ్యాటరీ వేగంగా డ్రెయిన్‌ కావడానికి కారణం.

అంటే స్మార్ట్‌ఫోన్‌ లోని చాలా యాప్స్‌ మనం వినియోగించకపోయినా కూడా బ్యాగ్రౌండ్‌ లో పనిచేస్తుంటాయి. వీటి సెట్టింగ్స్‌ లోనూ మార్పులు చేసుకోవాలి. ఫలితంగా బ్యాటరీ డ్రెయిన్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

* డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ :

స్మార్ట్‌ఫోన్‌ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ ఎక్కువగా ఉంటే, బ్యాటరీ త్వరగా డ్రెయిన్‌ అవుతుంది. అడాప్టివ్‌ బ్రైట్‌నెస్‌ ఫీచర్‌ ను యాక్టివేట్‌ చేసుకోవడం ద్వారా బ్యాటరీ త్వరగా డిశ్ఛార్జీ కాకుండా జాగ్రత్తపడొచ్చు. ఫోన్‌ వినియోగించిన అనంతరం డిస్‌ప్లే త్వరగా ఆఫ్‌ అయ్యేందుకు వీలుగా సెట్టింగ్స్‌ లో మార్పులు చేసుకోవాలి.

* 15 సెకన్లు లేదా 30 సెకన్లు :

అంటే Screen Timeout సెట్టింగ్స్‌ లోకి వెళ్లి 15 లేదా 30 సెకన్లుగా మార్చుకోవచ్చు. దీంతోపాటు ఫోన్‌ రీఫ్రెష్‌ రేట్‌ సెట్టింగ్స్‌లోనూ మార్పులు చేసుకోవాలి. ప్రస్తుతం అనేక స్మార్ట్‌ఫోన్‌లు 90Hz నుంచి 120Hz రీఫ్రెష్‌ రేట్‌ను అందిస్తున్నాయి.

ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌ 144Hz, 165Hz రీఫ్రెష్‌ రేట్‌ ను కూడా అందిస్తున్నాయి. అధిక రీఫ్రెష్‌ రేట్‌ కారణంగా బ్యాటరీ ఛార్జింగ్‌ త్వరగా ఖర్చు అవుతుంది. బ్యాటరీ లైఫ్‌ కావాలంటే డిస్‌ప్లే రీఫ్రెష్‌ రేట్‌ ను 60Hz కి మార్చుకొని వినియోగించుకోవచ్చు. ఫలితంగా తక్కువ ఛార్జింగ్‌ ఖర్చు అవుతుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.