రైల్వే ప్రయాణికులకు ఇది కదా కావాల్సింది.. ఇకపై ఏసీ బోగీల్లో

న దేశంలో ఎక్కువ మంది ప్రజలు ప్రయాణించేది రైళ్లలోనే. రోజూ కోట్ల మందిని రైల్వే తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఛార్జీలు తక్కువ, దేశంలో ఎక్కడికైన వెళ్లగలిగేలా ఉండడమే రైళ్లలో రద్దీకి కారణమని చెప్పొచ్చు.


రైలులో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వారికి రైల్వే ఒక ముఖ్యమైన మార్పు తెచ్చింది. ఇకపై దుప్పట్ల శుభ్రత గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్ల శుభ్రతపై ఉండే సందేహాలను పూర్తిగా తొలగించడమే దీని ముఖ్య ఉద్దేశం

కొత్తగా ఏం వస్తుంది?

ప్రతి ప్రయాణికుడికి, ప్రతి ప్రయాణంలో శుభ్రమైన కవర్లతో కప్పిన దుప్పట్లను అందిస్తారు. ఈ కవర్లు ఉతకగలిగే పదార్థంతో తయారు చేస్తారు. ప్రతి ట్రిప్ తర్వాత తప్పనిసరిగా మార్చి శుభ్రం చేస్తారు. కవర్లు వెల్క్రో లేదా జిప్ లాక్‌లతో మూసివేసి ఉంటాయి. తద్వారా వాటి పరిశుభ్రత చివరి వరకు చెక్కుచెదరకుండా ఉంటుంది. ప్రారంభంలో మన్నిక, సులభంగా ఉతకడం కోసం సంగనేరి ప్రింట్ ఫాబ్రిక్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రయోగ ఫలితాలను బట్టి భవిష్యత్తులో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సాంప్రదాయ ప్రింట్‌లను కూడా చేర్చడానికి ప్రణాళికలు ఉన్నాయి.

ఎందుకు ఈ కొత్త చొరవ?

ప్రస్తుతానికి ఈ కొత్త దుప్పటి కవర్ల వ్యవస్థ జైపూర్-అహ్మదాబాద్ మార్గంలో నడుస్తున్న రైలులో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. “రైల్వే వ్యవస్థలో దుప్పట్ల వాడకం ఎప్పటినుంచో ఉన్నా వాటి శుభ్రత విషయంలో ప్రయాణికులలో ఎప్పుడూ ఒక సందేహం ఉండేది. వాటిని పూర్తిగా తొలగించడానికి.. జైపూర్ రైల్వే స్టేషన్ నుండి పైలట్ కార్యక్రమంగా దుప్పటి కవర్ల స్కీమ్ తీసుకొచ్చాం” అని తెలిపారు. అంతేకాకుండా చిన్న స్టేషన్లలో కూడా ప్లాట్‌ఫామ్ ఎత్తు, సైన్‌బోర్డులు, సమాచార వ్యవస్థలలో సౌకర్యాలను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.

లాభం ఏమిటి?

మంచి శుభ్రత: వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

సంతోషంగా ప్రయాణం: శుభ్రమైన దుప్పటి దొరికినందుకు ప్రయాణికులు మరింత సంతృప్తిగా ఫీల్ అవుతారు.

దేశమంతా అమలు: ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దేశంలోని అన్ని ఏసీ రైళ్లలో ఈ కొత్త పద్ధతిని అమలు చేస్తారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.