ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

అనారోగ్య సమస్యతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన రిటోజ బసు (22) ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌ మాదాపూర్‌లో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నారు. గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీలో హెచ్ఆర్‌గా పనిచేస్తున్నారు.ఈనెల 3న తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యా యత్నం చేశారు. స్థానికులు ఆమెను దవఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.