IT Notice : రూ.1.83 కోట్లు చెల్లించాలని…లారీ డ్రైవర్‌కు ఐటీ నోటీసు!

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కోట్ల రూపాయల చెల్లింపు కోరుతూ ఐటీ శాఖ నుంచి నోటీసు అందిందని చెప్పారు.


శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బొప్పాయిపురం పంచాయతీ చల్లపేటకు చెందిన చల్లా నాగేశ్వరరావు అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తనకు ఐటీ శాఖ నుంచి రూ.1.83 కోట్లు చెల్లించాలని నోటీసు అందిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు ఎకరానికి 30 సెంట్ల భూమి మాత్రమే ఉంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని నోటీసు అందడం దారుణమని ఆయన బాధ వ్యక్తం చేశారు.