చైనాలో పిట్టల్లా రాలిపోతున్న ప్రజలు.. కరోనా కంటే డేంజర్‌గా ఉందిగా!

www.mannamweb.com


చైనాలో HMPV వైరస్ విధ్వసం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. చాలా మంది ఈ వ్యాధి బారిన పడి, తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా పలు కథనాలు ప్రచురించింది.

దీనిపై ఆ దేశం కూడా స్పందించింది. నిజంగానే తమ దేశంలో HMPV వైరస్ ఉందని, కాకపోతే దీని ప్రభావం అత్యంత ఎక్కువగా లేదని తేల్చి చెప్పింది. సాధారణంగా ఇలాంటి వ్యాధులు చలికాలంలో వస్తుంటాయని, దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఇదిలా ఉండగా ప్రపంచ దేశాలు మాత్రం ఈ వైరస్ గురించి తీవ్రమైన భయాందోళనలు చెందుతున్నాయి. ఎక్కడ పెను ముప్పుగా మారుతుందోనని భయపడుతున్నాయి. కరోనా మాదిరిగానే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందా అని కంగారు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో మరింత భయాన్ని కలిగిస్తుంది. ఆ వీడియో ఏంటి? అందులో ఏముంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వీడియోలో ఏముందంటే?

సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వీడియోలో అక్కడి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. నిల్చున్న చోటే కూలిపోతున్నారు. కొన్ని వందల మంది ఇలా పక్షుల మాదిరిగా అక్కడికక్కడే పడిపోతున్నారు. వారిని కొందరు ఫుల్ బాడీ మాస్క్ వేసుకొని కింద పడిపోతున్న వ్యక్తులను లాకేళ్లిపోతున్నారు. కనీసం కనికరం లేకుండా వారిని కుక్కలా మాదిరిగా లాక్కొని వెళ్తున్న వీడియో ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తుంది. ఆ వ్యక్తులంతా మరణించినట్లే కనిపిస్తుండగా.. అందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.