ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడమో.. చిట్టీలు వేయడమో కాదు.. ఈ పనిచేయండి

 జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలని చాలామందికి ఉంటుంది. కానీ అందుకు సరైన ఆర్థిక ప్రణాళిక వేసేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది మధ్యతరగతి ప్రజలు ధనవంతులను చూసి తాము అదే పొజిషన్లో ఉండాలని అనుకుంటారు.


కానీ ధనవంతులు చేసే ప్రణాళికలు.. ఆలోచనలు మాత్రం చేయరు. వారి విధంగా ఆలోచనలు చేస్తే ఖచ్చితంగా వారి సరసన చేరే అవకాశం ఉంటుంది. అసలు ఎలాంటి ప్రణాళిక వేస్తే ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది?

ఈరోజుల్లో ఆదాయానికి మించి అవసరాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం పెంచుకోవాలని చాలామంది చూస్తున్నారు. ఇందుకోసం రకరకాల పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు ప్రత్యేకంగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. అయితే ఇవి అనుకున్నంత స్థాయిలో లాభాలు రావడం లేదు. దీంతో ఆదాయం సరిపోవడం లేదు. అటు ఉద్యోగం చేసేవారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటున్నాయి. దీంతో అప్పుల పాలు అవుతున్నారు.

ప్రతి ఒక్క వ్యక్తికి తనకు సరిపోయే ఆదాయం ఎన్నడూ రాదు. అయితే మనం చేసే ఖర్చులు, కొన్ని వస్తువుల్లో పరిమితి ఉంచుకోవాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకు వచ్చిన ఆదాయంతో రూ .10 లక్షలు పెట్టి కారు కొనుగోలు చేస్తాడు. అయితే అంతకంటే తక్కువ ఆదాయం వచ్చే వ్యక్తి కూడా కారు కొనాలని చూస్తుంటాడు. కారులో తిరగాలనుకోవడం తప్పేం కాదు. కానీ ఆ కోరికను పరిమితులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కారులో తిరగాలని అనుకున్నప్పుడు తనకు వచ్చే ఆదాయం ఎంత? అనేది చూసుకోవాలి. అయితే ఇతరుల ఆడంబరాలు చూసి కొందరు అప్పులు చేసి కారు కొనాలని అనుకుంటారు. అలా చేయడంవల్ల తిప్పలు పాలు కాక తప్పదు.

ఆదాయం పెరగాలంటే కేవలం జీతం పైనే ఆధారపడడం సరికాదు. వచ్చిన జీవితంలో సగభాగం ఖర్చులకు వినియోగించి.. మిగతా సగంలో కొంత భాగం పొదుపు కోసం కేటాయించాలి. మిగతా సగం ఎమర్జెన్సీ ఫండ్ కింద ఏర్పాటు చేసుకోవాలి. అయితే చాలామంది ఖర్చులు విపరీతంగా చేస్తూ.. పొదుపు తక్కువ చేస్తున్నారు. కొంతమంది 25% పొదుపు చేస్తున్నా.. అంతలోనే ఆగిపోతున్నారు. ఈ పొదుపు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోవాలి. అలా పోవడం వల్ల దీర్ఘకాలికంగా ఎంతో ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.

ఖర్చుల విషయంలో చాలావరకు పరిమితులు ఏర్పాటు చేసుకోవాలి. దుబారా ఖర్చులను నియంత్రణ చేసిన సమయంలోనే ఆదాయం పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని విలాస వస్తువులకు దూరంగా ఉండాలి. వీటివల్ల ఉపయోగం అయితే పర్వాలేదు.. కానీ నిరుపయోగంగా ఉంటే మాత్రం అవి ఎన్నటికైనా నష్టాన్ని చేకూరుస్తాయి.

కొంతమంది వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులో జమ చేయడమో.. చిట్టీలు వేయడమో చేస్తుంటారు. కానీ అనేక రకాలుగా ఈ పెట్టుబడులు వేస్తూ పోవాలి. కేవలం ఒకే దానిలో కాకుండా మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. ఇలా అన్ని కలిపి ఒకేసారి దీనికి కాలికంగా అనేక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.