ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. వారం ముందే వేతనాలు చెల్లింపు

వరుసగా రెండు ప్రధాన పండుగలు వస్తుండడంతో ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు పండుగ కానుక అందించింది.


మొదటి తారీఖున చెల్లించాల్సిన జీతాలను ముందే చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ముందస్తు జీతాల చెల్లింపు దేశవ్యాప్తంగా కాకుండా కేవలం రెండు రాష్ట్రాల ఉద్యోగులకు మాత్రమే వర్తించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హిందూవుల ప్రధాన వినాయక చవితి పండుగ ఈనెల 27వ తేదీన రానుండగా.. మరో ప్రధాన పండుగ ఓనం వచ్చింది. ఈ పండుగలు దక్షిణాది ప్రాంతంలో పెద్ద ఎత్తున చేస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళలోని ఉద్యోగులు, పెన్షనర్లకు ఆగస్టు నెలకు సంబంధించిన ముందస్తుగా చెల్లింపులు చేయనున్నాయి. వేతనాలు, పింఛన్లు ముందస్తుగా చెల్లిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరాఠా, మలయాళ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.

మహారాష్ట్ర ఉద్యోగులకు..
గణపతి పండుగకు ఆగస్టు 26వ తేదీ మంగళవారం రోజున మహారాష్ట్రలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను అందించనుంది. రక్షణ, పోస్ట్, టెలీకమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారిని ముందుగానే విడుదల చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆగస్టు నెలకు సంబంధించిన మహారాష్ట్రలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు రానున్నాయి.

కేరళ ఉద్యోగులకు..
మలయాళ ప్రజలు అత్యంత గొప్పగా చేసుకునే పండుగ ఓనం. కేరళలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ముందస్తుగా వేతనాలు, పింఛన్లు చెల్లించనున్నారు. రక్షణ, తపాలా, టెలీ కమ్యూనికేషన్ రంగాలకు చెందిన ఉద్యోగులతో సహా ఆగస్టు 2025 జీతాలను, ఓనం పండుగకు ముందు ఆగస్టు 25వ తేదీన సోమవారం విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

‘ఓనం’ పండుగ దృష్ట్యా.. కేరళ రాష్ట్రంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల/వేతనాలు/ పెన్షన్‌లను కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు (రక్షణ, తపాలా, టెలీ కమ్యూనికేషన్‌లతో సహా) డ్రా చేసి పంపిణీ చేయవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. కేరళ రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక ఉద్యోగుల వేతనాలను కూడా పైన ఇచ్చిన తేదీ ప్రకారం ముందుగానే చెల్లించవచ్చని సర్క్యులర్‌లో ప్రభుత్వం పేర్కొంది. వేతనం, పెన్షన్ చెల్లింపులను ముందస్తు చెల్లింపులుగా పరిగణిస్తామని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు పేర్కొంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.