అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్లు మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాయి. రెండో రోజు ఆటలో టీమ్‌ఇండియా (Team India) ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అర్ధశతకం సాధించాడు. అలాగే ఓ మైలురాయికి చేరుకున్నాడు.
టెస్ట్ మ్యాచుల్లో సిక్స్‌ల విషయంలో టీమ్‌ఇండియా బ్యాటర్లలో ఎంఎస్ ధోని (MS Dhoni) సరసన నిలిచాడు. జడేజా ఈ మ్యాచ్‌లో కరేబియన్ బౌలర్ జోమెల్ వారికన్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ బాదాడు. ఇది అతడి టెస్ట్ కెరీర్‌లో 78*వ సిక్స్. ధోని కూడా సరిగ్గా ఇన్ని సిక్స్‌లే కొట్టాడు. భారత బ్యాటర్లలో.. రోహిత్ శర్మ (Rohit Sharma) (88), రిషభ్‌పంత్ (Rishabh Pant) (90*), వీరేంద్రసెహ్వాగ్ (91) మాత్రమే ముందున్నారు. వీరిలో రిషభ్ పంత్ ఒక్కడే టెస్ట్ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు. అయితే ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ సందర్భంగా గాయపడిన పంత్.. ప్రస్తుతం ఈ వెస్టిండీస్ సిరీస్‌లో ఆడటం లేదు.
































