ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలువురు ప్రముఖులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అర్ద్రరాత్రి నుంచి చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు.
మాజీ సీఎం జగన్ ప్రతీ ఏడాది లాగానే ఈ సారి పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదాల వేళ మొత్తం కుటుంబం ఒకే వేదిక మీదకు వచ్చి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు.
తల్లి విజయమ్మతో కలిసి
మాజీ సీఎ జగన్ క్రిస్మస్ వేడకల్లో పాల్గొన్నారు. ముందుగానే పులివెందుల చేరుకున్న జగన్ మంగళవారం ఇడుపులపాయ లో తన తండ్రి రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించారు. ఆ తరువాత ప్రేయర్ హాల్‌లో క్రిస్మస్ సందర్భంగా జరిగిన ప్రత్యేక ప్రార్ధనల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పాస్టర్లు క్రిస్మస్ సందేశాన్ని అందించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్ధనల్లో తల్లి విజయమ్మ, భారతి, జగన్ ఇద్దరు కుమార్తెలతో పాటుగా కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అనంత రం విశ్రాంతి భవనంలోకి వెళ్లి పలువురు నాయకులతో కాసేపు చర్చించారు.
కుటుంబ సభ్యులతో కలిసి
నెమళ్లపార్కు సమీపంలో ఉన్న ఆడిటోరియంలో తల్లి విజయలక్ష్మి, సతీమణి భారతి, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ముందస్తు క్రిస్మస్ ప్రార్థనలకు హాజరయ్యారు. ఇక, ఈ రోజు క్రిస్మస్ ప్రార్ధనల్లోనూ మొత్తం కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రార్ధనలకు హాజరయ్యారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గం లో నడిపిస్తాయని జగన్ పేర్కొన్నారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని జగన్ తన సందేశంలో వివరించారు.
విదేశాల్లో షర్మిల
తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారని చెప్పారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ బాటలు వేశారని తెలిపారు. క్రీస్తు బోధనలు మనుషు లందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయని వివరించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రెస్తవులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఇడుపులపాయలో కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకొనే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారు. విదేశీ పర్యటనలో ఉన్నారని సమాచారం.