జగన్ తొలగింపు.. చంద్రబాబు పిలుపు: మళ్లీ విధుల్లోకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్

జగన్(Jagan) అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం జిల్లా(Anantapur District)కు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్(AR Constable Prakash) విధుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.


అయితే ఆయనకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల్లోకి తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించింది. దీంతో డీజీపీ కార్యాలయం నుంచి ఆర్డర్స్ తీసుకున్నారు. అనంతరం ఎస్పీ జగదీశ్‌ను కలిశారు. ఏఆర్ కానిస్టేబుల్‌గా ప్రకాశ్‌ విధుల్లో చేరారు. దీంతో కూటమి ప్రభుత్వానికి, డీజీపీకి ప్రకాశ్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా జగన్ సీఎంగా ఉన్న సమయంలో సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటించారు. ఆ సమయంలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్ అనంతపురంలో ఆమరణ దీక్ష చేశారు. 70 వేల మంది పోలీసులకు బకాయిలు చెల్లించాలని సీఎం సార్ ప్లీజ్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించి నిరసన చేపట్టారు. దీంతో ఆయనపై వేధింపులు ప్రారంభమయ్యాయి. పాత కేసులన్నీ బయటకు వచ్చాయి. ఈ మేరకు ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్‌ను విధుల నుంచి తొలగించారు. మళ్లీ ఇన్నాళ్టికి ఆయనకు విముక్తి కలిగింది. ప్రస్తుతం ఏఆర్ కానిస్టేబుల్‌గా ప్రకాశ్ బాధ్యతలు తీసుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.