జగన్ విధ్వంస ఆలోచన.. మాజీ ఐఏఎస్ విప్పిన గుట్టు… !

మాజీ సీఎం జగన్ ఆలోచనా విధానం.. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేసిన అడుగులు కూడా..
ప్రజల మధ్య అప్పటి ప్రతిపక్షాలు చర్చించాయి. ముఖ్యంగా అభివృద్ధి లేకపోవడం.. ఉద్యోగాలు రాకపోవడం .. అనే కాన్సెప్టు.. జగన్‌ను ఇబ్బందులకు గురి చేసింది. ఇదేసమయంలో రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించకుండా.. ప్రజల పన్నులు పెంచడమే ఆదాయానికి గీటు రాయి అన్నట్టుగా ముందుకు సాగారు.


మొత్తంగా జగన్ ఆలోచనా విధానం ఎన్నికలకు ముందు బాగానే చర్చకు వచ్చింది. అయితే.. తాజాగా మరో కీలక విషయం కూడా వెలుగు చూసింది. జగన్ ఆలోచన గురించి మాజీ ఐఏఎస్‌, అప్పటిప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వివరించారు. జగన్ ఆలోచన తెలిసిన తర్వాత.. తనకు దిగ్భ్రాంతి కలిగిందన్నారు. ఇలా కూడా మనుషులు ఆలోచిస్తారా? అని తాను అనుకున్నట్టు చెప్పారు. తాజాగా ఓ మీడియా కార్యక్రమంలో ఎల్వీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఎల్వీ మాట్టాడుతూ.. ఒక సాధారణ మనిషికి కూడా ఇలా ఆలోచించలేరని దుయ్యబట్టారు. రాష్ట్రానికి అప్ప టికే ఉన్న రాజధాని అమరావతిని డెవలప్ చేయడం మానేసి.. ఎక్కడోవిశాఖను పరిపాలన రాజధానిగా జగన్ ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో అమరావతిని అలా నాన్చేశారు. ఒక సందర్భంలో జగన్ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్వీతో భేటీ అయి.. విశాఖను రాజధానిని చేయాలని అనుకుంటున్నట్టు చెప్పారట. అంతేకాదు.. దీనికి స్థలం కూడా రెడీగానే ఉందని చెప్పినట్టు ఎల్వీ తెలిపారు.

అదేంటని ఆశ్చర్యంవ్యక్తం చేసేలోగానే.. ప్రస్తుతం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంటును తీసేసి.. ఆ ప్రాంతాన్ని(33 వేల ఎకరాలు) రాజధానిని చేయాలని జగన్ చెప్పినట్టు ఎల్వీ పేర్కొన్నారు. ఈ ఆలోచన విని తాను ఆశ్చర్యపోయానన్నారు. ఇదేం ఆలోచన అని తాను ధైర్యంగానే జగన్‌ను ప్రశ్నించానని.. అయితే.. ఆయన వాదించారని.. అందుకే నీతో నాకు ఇబ్బందులు వస్తున్నాయని కూడా వ్యాఖ్యానిచినట్టు ఎల్వీ తెలిపారు. తాజాగా ఈ విషయాలు పంచుకున్న ఎల్వీ.. జగన్ విధ్వంస ఆలోచనలు ఇలా కూడా ఉంటాయని చెప్పుకొచ్చారు.