లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్‌ రోల్‌ మోడల్: సోమిరెడ్డి

www.mannamweb.com


ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఏపీని ముంచెత్తాయి. ముఖ్యంగా విజయవాడ నగరం వరదలతో అల్లాడిపోయింది. అటు ప్రజలు తిప్పులు పడుతుంటే.. ఇటు పొలిటికల్ డైలాగ్‌లు భారీగా పేలుతున్నాయి. వరదలకు మీరంటే.. మీరని అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదలకు ప్రభుత్వమే కారణమని.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరోపించారు. విజయవాడ, కాకినాడ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. చంద్రబాబు, మంత్రులపై విమర్శలు గుప్పించారు. జగన్ చేసిన కామెంట్స్‌పై అటు అధికార పార్టీ నేతలు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా.. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్‌పై ఫైర్ అయ్యారు.

‘ఏలేరు రిజర్వాయర్‌కు ఊహించని వరద వచ్చింది. ప్రాణ నష్టం జరగకుండా కాపాడటంలో.. కూటమి ప్రభుత్వం విజయవంతమైంది. జగన్‌ హయాంలో వరద వస్తే కాకినాడ మునిగింది. జగన్‌ పాలనలో ఇరిగేషన్‌, వ్యవసాయ శాఖలు మూసేశారు. విపత్తును ఎదుర్కోవడంలో చంద్రబాబు రోల్‌ మోడల్‌. లక్షల కోట్లు దోచుకోవడంలో జగన్‌ రోల్‌ మోడల్. ఇరిగేషన్‌ శాఖపై జగన్‌కు అవగాహన లేదు’ అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్‌కు కౌంటర్ ఇచ్చారు.

వైసీపీ అధినేత జగన్ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇసుకపల్లి, నాగులపల్లిలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. రైతులు నీట మునిగిన వరి నాట్లను జగన్‌కు చూపిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. వరద బాధితులను జగన్మోహన్ రెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందట్లేదంటూ రైతులు తమ సమస్యలన జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పాడైన వరి నారును చుపుతూ వారి గోడును వినిపించారు.
నిర్లక్ష్యమే కారణం..

వైసీపీ అధినేత జగన్‌ రాకతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. జగన్ వెంట నియోజకవర్గ ఇంఛార్జ్ వంగా గీతతోపాటు పలువురు నాయకులు ఉన్నారు. ఏలేరు వరదతో పంట మొత్తం నాశనం అయిపోయిందని రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. తమను ఆదుకోవాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్.. ఏలేరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుందని విమర్శించారు. వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉందని.. ఏలేరు రిజర్వాయర్‌కి వచ్చే ఇన్‌ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్‌ చేయలేదని ప్రశ్నించారు.

బీమా క్లెయిమ్‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి..

‘గ‌తంలో ఎన్న‌డూలేని విధంగా విజ‌య‌వాడ‌కు వ‌ర‌ద ముంపు ఎదురైంది. సంక్షోభ స్థితిలో ఉన్నవారికి మాన‌వ‌తా కోణంలో స‌హాయ‌స‌హ‌కారాలు అందించాల్సిన అవ‌స‌ర‌ముంది. బీమా క్లెయిమ్‌ల స‌త్వ‌ర ప‌రిష్కారానికి విజ‌య‌వాడ స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప్రాంగ‌ణంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేష‌న్ కేంద్రం ద్వారా న్యాయ‌మైన సెటిల్‌మెంట్స్ జ‌రిగేలా చూడాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు నిబ‌ద్ధ‌త‌తో వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించాలి. వాహ‌నాలు, గృహాలు, వ్యాపార వాణిజ్య ఆస్తుల న‌ష్టాల‌కు సంబంధించి జ‌రిగిన న‌ష్టాల‌పై వ‌చ్చిన ప్ర‌తి క్లెయిమ్‌నూ స‌రైన విధంగా అసెస్ చేసి ఆ మేర‌కు పూర్తిస్థాయిలో సెటిల్‌మెంట్ చేయాలి. మొత్తంమీద ప‌దిరోజుల్లో ఈ ప్ర‌క్రియ పూర్తిచేసేందుకు కృషిచేయాలి’ అని సీఎం చంద్రబాబు సూచించారు.