హాలీవుడ్ మూవీస్‌ను ఇష్టపడేవారికి ‘టెర్మినేటర్’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘టెర్మినేటర్’గా లెజెండరీ యాక్టర్ ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ చేసిన సందడిని ఎవరూ ఇంకా మర్చిపోలేదు. నైంటీస్ కిడ్స్ మోస్ట్ ఫేవరెట్ యాక్షన్ ఫిల్మ్స్‌లో ఒకటిగా ఈ సినిమాను చెప్పొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో మానవాళికి ఉన్న ప్రమాదాన్ని చెబుతూ ఈ చిత్ర కథ సాగుతుంది. స్కైనెట్ అనే సూపర్ కంప్యూటర్ క్రియేట్ చేసిన సైబర్నెటిక్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. దాని నుంచి మానవాళిని కాపాడే టెర్మినేటర్‌గా ఆర్నాల్ట్ స్క్వాజ్‌నెగ్గర్ నటన, జేమ్స్ కామెరూన్ టేకింగ్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్‌కు గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఇప్పటివరకు నాలుగు పార్ట్‌లుగా వచ్చిన ఈ సిరీస్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.
‘టెర్మినేటర్’ మళ్లీ రాబోతున్నాడు. ఈ సిరీస్ నుంచి న్యూ ఫిల్మ్ రాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా జేమ్స్ కామెరూన్ రివీల్ చేశారు. ‘టెర్మినేటర్ జీరో’ అనే యానిమేషన్ సిరీస్‌ను రూపొందిస్తూ బిజీగా ఉన్నారు కామెరూన్. తాజాగా ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘టెర్మినేటర్’ సిరీస్ నుంచి కొత్త చిత్రం రాబోతోందని తెలిపారు. దాని పనులు మొదలయ్యాయని చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ కోసం తాను ప్రస్తుతం తీస్తున్న ‘టెర్మినేటర్ జీరో’తో నయా ఫిల్మ్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘టెర్మినేటర్ నుంచి కొత్త ప్రాజెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పుడే అన్ని వివరాలు చెప్పలేను’ అని జేమ్స్ కామెరాన్ పేర్కొన్నారు. ఈ వార్త వినగానే ఆయన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.
జేమ్స్ కామెరాన్ డైరెక్షన్లో ‘టెర్మినేటర్’ కొత్త పార్ట్ అదిరిపోవడం ఖాయమని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఆయన ఇమాజినేషన్, థాట్ ప్రాసెస్‌కు న్యూ టెక్నాలజీ తోడైతే సినిమా వేరే లెవల్ ఉంటుందని, ఎవరి ఊహకు కూడా అందదని చెబుతున్నారు. కాగా, ‘టెర్మినేటర్’ ఫ్రాంచైజీని జేమ్స్ కామెరూన్ 1980వ దశకంలో మొదలుపెట్టారు. ఆయన దర్శకత్వంలో ఆ సిరీస్ నుంచి ‘ది టెర్మినేటర్’ అనే ఫస్ట్ పార్ట్ 1984లో రిలీజ్ అయింది. అది బ్లాక్‌బస్టర్ అయింది. 1991లో సెకండ్ పార్ట్ ‘జడ్జిమెంట్ డే‘ వచ్చి అదీ సూపర్‌హిట్ అయింది. ఈ రెండింటినీ జేమ్స్ కామెరూన్ తీశారు. ఆ తర్వాత వచ్చిన మూడు, నాలుగు పార్ట్‌లను ఇతర దర్శకులు తెరకెక్కించారు. ఇప్పుడు ‘టెర్మినేటర్’ న్యూ ప్రాజెక్ట్ కోసం ఆయన మెగా ఫోన్ చేపట్టడంతో ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.