ఎస్సీ వర్గీకరణకు జనసేన సంపూర్ణ మద్దతు: పవన్‌కల్యాణ్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ రూపకర్త అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కొనియాడారు. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నివేదికకు జనసేన సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని ఆయన తెలిపారు. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయి వరకు వచ్చిందంటే మందకృష్ణ మాదిగ, సీఎం చంద్రబాబు కారణమని పవన్‌ అన్నారు. బేడ, బుడగ జంగాలు, రెల్లి కులాలకు కూడా న్యాయం చేయాలని సూచించారు