సిడ్నీ టెస్టులో భారత కెప్టెన్ బుమ్రా(Jasprit Bumrah) గాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో రోజు ఆట నుంచి అతను తప్పుకున్నాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ నుంచి అతని ఆస్పత్రికి వెళ్లినట్లు తెలుస్తోంది.
స్కానింగ్ కోసం బుమ్రా వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. ఇవాళ భోజన విరామం తర్వాత ఓ ఓవర్ వేసిన బుమ్రా.. ఆ తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టలేదు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు బుమ్రా 10 ఓవర్లు వేసి 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. బహుశా స్కానింగ్‌కు వెళ్తుండాని అనుకుంటున్నట్లు భారత కామెంటేటర్ రవిశాస్త్రి తెలిపారు. బుమ్రా ఆరోగ్య సరిగా లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో మళ్లీ అతను బౌలింగ్ చేస్తాడన్న నమ్మకం లేదన్నారు. ట్రైనింగ్ కిట్ డ్రెస్సులో అతను ఆస్పత్రికి వెళ్లాడు.
మరో వైపు ఆస్ట్రేలియా తన ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తాజా సమాచారం ప్రకారం 44 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 రన్స్ చేసింది.