జత్వానీ స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేసిన పోలీసులు.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే

www.mannamweb.com


ముంబై నటి కాదంబరీ జత్వానీ వ్యవహారం ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. కొందరు సీనియర్ ఐపీఎస్‌లు అధికారాన్ని దుర్వినియోగం చేసి… తనను వేధించారని ఆమె చేసిన ఆరోపణలను ఏపీ ప్రభుత్వం ఫుల్ సీరియస్‌గా తీసుకుంది.

దీనిపై సమగ్ర విచారణకు సీఎంవో ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ముంబై నుంచి విజయవాడ వచ్చి సీపీకి ఫిర్యాదు చేసి… విచారణకు హాజరయ్యారు జత్వాని. విజయవాడ సీపీ ఆఫీస్‌లో జత్వానినీ మూడు గంటలపాటు విచారించారు అధికారులు. ఆమె స్టేట్‌మెంట్ రికార్డు చేసుకున్నారు. ఆమె తల్లి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో జత్వానీ కీలక విషయాలు వెల్లడించారు. ఆధారాలతో పాటు పలు డాక్యుమెంట్స్‌ను పోలీసులకు సమర్పించారామె.

పోలీసుల విచారణ అనంతరం జత్వాని కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటకు రావాలి… తనపై అక్రమ కేసులు పెట్టిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలన్నారు. పలువురు ఐపీఎస్‌ అధికారులపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను చాలా ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఉన్న సాక్ష్యాలు, ఆధారాలు పోలీసులకు అందజేశానన్నారు.

ఇక జత్వానీపై ఇప్పటివరకు ఎలాంటి కేసులు లేవంటున్నారు ఆమె తరుపు లాయర్. 41ఏ నోటీలిసులు ఇచ్చే కేసులో పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. వృద్ధులైన ఆమె తల్లిదండ్రులను జైలులో పెట్టి బెయిల్‌ రాకుండా చేశారని, దీని వెనుకు ఎవరెవరు ఉన్నారో విచారణలో తేలుతుందని చెప్పారు. జత్వానీ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపైనా కంప్లైంట్‌ చేసినట్లు తెలిపారు.

మొత్తంగా… జత్వానీ కేసు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక స్టేట్‌మెంట్ రికార్డ్‌ చేసిన పోలీసులు… ఆ స్టేట్‌మెంట్‌ ఆధారంగానే కేసులు పెట్టే ఛాన్స్‌ కనిపిస్తోంది. మరి చూడాలి… ఈ కేసు ఎలా మందుకెళ్తుందో…! ఇంకెంతమంది బయటకొస్తారో….!