NHRC చైర్ పర్సన్‌కు వడ్డించిన భోజనంలో జెర్రి.. సుబ్బయ్య గారి హోటల్ సీజ్

www.mannamweb.com


నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్ పర్సన్‌ విజయా భారతికి విజయవాడలో చేదు అనుభవం ఎదురైంది. కాకినాడ సుబ్బయ్య హోటల్‌లో ఫుడ్ బాగుంటుందని చెప్పడంతో..

ఆమె లంచ్ చేయడానికి అక్కడికి వెళ్లారు. అయితే అనూహ్య రీతిలో భోజనం చేస్తుండగా.. ఆమెకు ఫుడ్‌లో జెర్రీ కనిపించింది. దీంతో.. తీవ్ర అసహనానికి లోనైన ఆమె వెంటనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన అధికారులు.. తనిఖీలు చేసి.. హెటల్ సీజ్ చేశారు.

లంచ్‌కో.. డిన్నర్‌కో.. బయట ప్లాన్‌ చేస్తున్నారా?.. అయితే.. జర జాగ్రత్త.. బయట ఫుడ్‌కి సేఫ్టీ లేదు.. ఫుడ్‌తో.. బెడ్‌ గ్యారంటీ అనే పరిస్థితులు దాపురించాయి. బతకాలంటే బయట ఫుడ్‌ మానేయాల్సిందే.. కాదు.. కూడదు.. అని.. అవుట్‌ సైడ్‌ ఫుడ్‌ తిన్నారా… తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం ఖాయం.. ఫుడ్‌ సేఫ్టీ అధికారుల దాడుల్లో కళ్లకు కనిపిస్తున్న దారుణ పరిస్థితులే అందుకు నిదర్శనం. ఇప్పుడు ఏకంగా ఫేమస్ హెటల్‌లో NHRC చైర్ పర్సన్‌ వడ్డించిన ఆహారంలోనే జెర్రి కనిపించింది. కోటి విద్యలూ కూటి కోసమే, ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా..
వేళకు తింటేనే ఆరోగ్యం పదిలం. కానీ టైమ్‌కు తినడమే కాదు.. ఏం తింటున్నామనేది కూడా ముఖ్యం. అందుకే భద్రం బీ కేర్‌ఫుల్.