త్వరలో రూ.5,999కే జియో 5G స్మార్ట్‌ఫోన్‌? కళ్లు చెదిరే ఫీచర్లతో

www.mannamweb.com


ప్రస్తుతం దేశంలో సరికొత్త టెక్నాలజీతో రకరకాల స్మార్ట్ ఫోన్స్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వస్తే చాలు.. ప్రజలు వాటిని కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా ఇప్పుడంతా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే.. ప్రముఖ ముబైల్ సంస్థలు కూడా సరికొత్త ఫ్యూచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే మొబైల్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకోవడంలో రిలయన్స్ జియోకు సాటి ఏదీ లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే.. రిలయన్స్ జియో మొబైల్ కస్టమర్లను ఆకర్షించడానికి అద్భుతమైన ఫీచర్లతో అధునాతన టెక్నాలజీతో ఎప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి రిలీజ్ చేస్తూనే ఉంటుంది.ఈ క్రమంలోనే జియో మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మార్కెట్ లో జియో భారత్ 1 5G స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుసురాబోతుంది. ఆ వివరాళ్లేంటో చూద్దాం.

దేశంలోని ప్రముఖ టెలికాం రంగంలో దూసుకుపోతున్న అతి పెద్ద నెట్ వర్క్ జియో కూడా ఒకటి. అయితే ఈ రిలయన్స్ జియో ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్న అది సంచలనమే. ముఖ్యంగా మొబైల్ వినియోగదారుల కోసం జియో ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలను తీసుకుంటదనే విషయం తెలిసిందే.ఇప్పటికే దేశంలో జియో 5G స్మార్ట్‌ఫోన్ల హవా ఏ రేంజ్ లో నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి తరుణంలో జియో కొత్తగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మార్కెట్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది. అయితే ప్రీమియం ఫీచర్లతో ఈ 5G ఫోన్ లను జియో అందుబాటులోకి తీసుకురానుంది. మరీ, ఆ ఫోన్ ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో త్వరలో మార్కెట్ లోకి కొత్తగా Jio Bharat 1 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అయితే ఇప్పటికే ఈ ఫోన్ ధరతో సహా కొన్ని ప్రత్యేక ఫీచర్లు లీక్ అయ్యాయి. కాగా, ఈ జియో భారత్ 1 5G స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.కాగా, దీని ధర రూ. 5,999 నుంచి రూ.6999 మధ్య మాత్రమే ఉంటుదట. పైగా ఈ ఫోన్ లో హై రిసొల్యూషన్ కెమెరా కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే జియో 5G ఫోన్ మూడు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉంది. అందులో 8GB RAM+128GB, 12GB RAM + 256GB, 16GB RAM + 512 GB ఉన్నట్లు సమాచారం. ఇకపోతే ఈ Jio Bharat 1 5G లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఈ ఫోన్‌ను ఈ సంవత్సరం చివరిలో మార్కెట్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం తెలిసింది.

ఇకపోతే జియో నుంచి రానున్న ఈ కొత్త 5G స్మార్ట్‌ఫోన్ డిజైన్‌ అద్భుతంగా ఉండనున్నట్లు సమాచారం. పైగా దీనిలో 6.7 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, ఈ సూపర్ AMOLED డిస్‌ప్లే‌లో క్లిస్టర్ క్లియర్ వీడియాలను చూడొచ్చు. అయితే ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని కారణంగా మీరు స్మూత్ టచ్‌ఫీల్‌ని పొందొచ్చు. అంతేకాకుండా.. ఈ ఫోన్ లో అద్భుతమైన ఫోటోలను క్యాప్చర్ చేయవచ్చు. దీంతో పాటు ఈ ఫోన్ లో 2,32,50MP కాకుండా 100MP ప్రైమరీ కెమెరా సెటప్‌తో వచ్చే అవకాశం ఉంది. పైగా 16MPఅల్ట్రా వైడ్ కెమెరాను చూడొచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఈ ఫోన్‌లో 32MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది. అలాగే ఈ ఫోన్ లో 6700mAh బ్యాటరీ ఉంది. ఇది 120వాట్ల సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 33w ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగించి సులభంగా ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా.. ఈ స్మార్ట్ ఫోన్ 30 నిమిషాల్లో ఛార్జిగ్ కూడా పూర్తయిపోవడమే కాకుండా.. 2 రోజుల కంటే ఎక్కువే ఛార్జింగ్ వస్తుందట. అయితే మార్కెట్ లో ఇన్ని రకాల ఫ్యూచర్స్ కలిగి అతి తక్కువ ధరకే అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ కోసం కస్టమర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.