Jio New 5G Smartphone : జియో అభిమానులకు గుడ్ న్యూస్.. అతి త్వరలో భారత మార్కెట్లో రిలయన్స్ జియో రూ. 10వేల లోపు ధరలో కొత్త క్వాల్‌కామ్ 5జీ పవర్డ్ ఫోన్‌ను లాంచ్ చేయనుంది. భారత ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోతో కలిసి క్వాల్‌కామ్ చిప్‌సెట్ కంపెనీ ఈ కొత్త జియో 5జీ ఫోన్ అభివృద్ధి చేస్తోంది. రూ. 10వేల లోపు సరసమైన 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలను కూడా ప్రకటించింది.
భారత మార్కెట్లో 2జీ నుంచి 5జీ నెట్‌వర్క్‌కి వేగవంతం చేయడమే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా వినియోగదారులకు సరికొత్త టెక్నాలజీని తక్కువ ఖర్చుతో కూడిన అప్‌గ్రేడ్‌ను అందించనుంది. క్వాల్‌కామ్ లేటెస్ట్ చిప్‌సెట్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ సరసమైన ధరకే ఫుల్ 5జీ ఎక్స్‌పీరియన్స్ అందించగలదని మనీకంట్రోల్ నివేదించింది.
కొత్త చిప్‌సెట్‌తో 5జీ ఫోన్ :
క్వాల్‌కామ్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, హ్యాండ్‌సెట్స్ జనరల్ మేనేజర్ క్రిస్ పాట్రిక్ ప్రకారం.. ఈ ఉత్పత్తి 4జీ, 5జీ టెక్నాలజీల మధ్య వ్యత్యాసాన్ని గుర్తించేలా భారతీయ మార్కెట్‌కు ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. కొత్త చిప్‌సెట్‌తో.. సరసమైన స్మార్ట్‌ఫోన్‌ల కోసం వెతుకుతున్న వినియోగదారులకు పూర్తి స్థాయిలో 5జీ సర్వీసులను అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని బార్సిలోనాలోని క్వాల్‌కామ్ హ్యాండ్‌సెట్స్ జనరల్ మేనేజర్ క్రిస్ పాట్రిక్ పేర్కొన్నారు.
4జీ, 5జీ మధ్య మార్పుపై దృష్టి పెడుతున్నామని ఆయన చెప్పారు. భారత మార్కెట్లోని మిలియన్ల మంది 2జీ వినియోగదారులను నేరుగా 5జీ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి కొత్త చిప్‌సెట్ సాయపడుతుందని క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్‌లు అభిప్రాయపడుతున్నారు. దేశంలో విస్తృతమైన పరిశోధన, అభివృద్ధితో చిప్‌సెట్, అధునాతన 5జీ సామర్థ్యాలను కొత్త ధర శ్రేణికి మార్చగలదని భావిస్తున్నారు.
2.8 బిలియన్ల మందికి 5జీ డివైజ్‌లు :
క్వాల్‌కామ్ ఇండియా ప్రెసిడెంట్ సావి సోయిన్ ప్రకారం.. సరసమైన 5జీ డివైజ్ జియో నుంచి అతి త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్‌లు సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ల మార్కెట్ విస్తరణపై ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్ఎమ్ఏ నుంచి డేటా ప్రకారం.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 2.8 బిలియన్ల మందికి 5జీ డివైజ్‌లు చేరుకోగలవని సూచిస్తున్నాయి.
ఇంకా, క్వాల్‌కామ్ వినియోగదారుల కోసం 5జీ టెక్నాలజీతో కలిగే ప్రయోజనాన్ని మరింత విస్తరించనుంది. మొత్తంమీద, రిలయన్స్ జియో, ఇతర భాగస్వామి (Qualcomm) సహకారంతో భారత టెలికం మార్కెట్లో 5జీ టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే సరసమైన ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ అందించాలని భావిస్తోంది. రాబోయే లాంచ్ ఈవెంట్లో హై-స్పీడ్ కనెక్టివిటీకి యాక్సస్ విస్తరించనుంది.