అద్భుతమైన ఫీచర్లతో Jio ఎలక్ట్రిక్ సైకిల్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కి.మీ, ధర ఎంతంటే

ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందుతుందో చూస్తూనే ఉన్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేసేందుకు ఎలక్ట్రికల్ వస్తువులు అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే.


ఎలక్ట్రిక్ తో అనుసంధానం చేసి పలు రకాల వస్తువులను కూడా తయారు చేస్తున్నారు. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే సైకిళ్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది. కానీ, ప్రస్తుతం సైకిల్‌లో కొత్త మార్పు రాబోతోంది. త్వరలో జియో ఎలక్ట్రిక్ సైకిల్ అందుబాటులోకి రానుంది.

రిలయన్స్ జియో త్వరలోనే తక్కువ ధరకే అధిక రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ సైకిల్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సైకిల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400కిలో మీటర్ల రేంజ్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. జియో ఎలక్ట్రిక్ సైకిల్ లో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో 3 నుంచి 5 గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది. దీంతోపాటు అదనంగా రిమూవబుల్ బ్యాటరీతో రానుంది. దీనిని సైకిల్ నుంచి తీసేసి వేరే చోట ఛార్జ్ చేయవచ్చు.

200 నుంచి 500 వాట్ల వరకు పవర్ ఉంటుంది. ఇది ఈకో, నార్మల్, స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ఇది కొండ ప్రాంతాల్లో కూడా సులభంగా నడుస్తుంది. బ్యాటరీ పూర్తిగా ఎగ్జాస్ట్ అయినా.. ఇందులో ప్యాడల్స్ ఉండటం వల్ల ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ జియో ఎలక్ట్రిక్ సైకిల్‌లో LED లైట్లు, జీపీఎస్, బ్లూటూత్ , మొబైల్ యాప్ ఇంటిగ్రేషన్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ వల్ల దీని పనితీరు కూడా బెటర్‌గా ఉంటుంది. తక్కువ ధరలో అందరికీ జియో ఎలక్ట్రిక్ సైకిల్ అందించడమే లక్ష్యంగా జియో భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, దీని ధర రూ.25 వేల నుంచి రూ.45వేల మధ్య ఉండొచ్చని సమాచారం

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.