టెలికాం సంస్థ రిలయన్స్ జియో అనేక రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ఇవి దీర్ఘకాలిక వాలిడిటీ, పరిమిత డేటాతో అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తాయి. ఎస్ఎంఎస్, జియో యాప్స్‌కి కూడా యాక్సెస్ ఉంటుంది.
టెలికాం కంపెనీలు ధరలను పెంచినప్పటి నుంచి కొత్త కొత్త ప్లాన్లు వస్తున్నాయి. మరోవైపు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) కాలింగ్, ఎస్ఎంఎస్ ప్లాన్ల కూడా తీసుకురావాలని టెలికాం కంపెనీలను ఆదేశించింది. ప్రస్తుతానికి కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ మాత్రమే ఉన్న ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటే ఎక్కువ డేటా లేకుండా చేసుకోవచ్చు. అప్పుడు వాల్యూ ప్లాన్లను ఎంచుకోవడం మంచిది. రిలయన్స్ జియో మూడు వాల్యూ ప్లాన్లను అందిస్తోంది.
జియో రూ.189 ప్లాన్
జియో యూజర్లకు రూ.189 వ్యాల్యూ ప్లాన్‌లో 28 రోజుల వాలిడిటీని ఇస్తుంది. మొత్తం 2జీబీ డేటాను పొందుతారు. ఈ వ్యాలిడిటీ పీరియడ్లో మొత్తం 300 ఎస్ఎంఎస్‌లు, అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ చేసుకోవచ్చు. వినియోగదారులు జియో ఫ్యామిలీ యాప్స్(జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ వంటివి)కు కూడా యాక్సెస్ పొందుతారు.
జియో రూ .479 ప్లాన్
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 6జీబీ డేటాను అందిస్తుంది. ఇది కాకుండా మొత్తం 1000 ఎస్ఎంఎస్‌లను పంపవచ్చు. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ రీఛార్జ్ తర్వాత జియో యాప్స్(జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్) యాక్సెస్ లభిస్తుంది.
జియో రూ .1899 ప్లాన్
రూ.1,899 ఖరీదైన ప్లాన్. అయితే ఇది 336 రోజుల వరకు వస్తుంది. రీఛార్జ్ చేసుకుంటే మొత్తం వ్యాలిడిటీ కాలానికి 24 జీబీ డేటా లభిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో మొత్తం 3600 ఎస్ఎంఎస్‌లను పంపే అవకాశం కూడా ఉంది. జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ యాప్స్ యాక్సెస్ లభిస్తుంది.
రోజువారీ డేటా అవసరం ఎక్కువగా లేని వారికి ఈ ప్లాన్స్ ఉత్తమమైనవి. అయితే స్మార్ట్‌ఫోన్లను వైఫై లేదా ఇతర సిమ్‌ల ద్వారా ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్లలో పరిమిత డేటాతో ఎక్కువ రోజుల కాలింగ్ వాలిడిటీ ప్రయోజనం లభిస్తుంది.