మీరు జియో కస్టమర్ అయితే మీకు బంపర్ ఆఫర్ ఉచిత కాలింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పొందే అవకాశం. ఈ ప్రైవేటు దిగ్గజ కంపెనీ ఈప్లాన్ లో అదనంగా ఎస్ఎంఎస్ ఫెసిలిటీ కూడా అందిస్తోంది. రిలయన్స్ జియో ఈ ప్లాన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం..
జియో రూ.349 ప్లాన్.. జియో కస్టమర్‌లకు రూ.349 ప్లాన్. ఈ ప్లాన్ ఓటీటీ సబ్ స్క్రైబ్ కూడా అందిస్తోంది .దీని వాలిడిటీ కూడా 28 రోజుల పాటు వర్తిస్తుంది. అంటే ఉచిత కాలింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా పొందవచ్చు. ఇందులో ప్రతి రోజు మీరు 2gb డేటా కూడా పొందుతారు. ఇది కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయినా చేసుకునే సదుపాయం ఉంటుంది.
జియో ఈ ప్లాన్‌లో 100 ఎస్ఎంఎస్లు ఉచితంతో పాటు జియో హాట్ స్టార్ 90 రోజుల సబ్స్ క్రిప్షన్ కూడా అందిస్తుంది. అదనంగా 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా పొందుతారు. ఇది జియో కస్టమర్‌లకు ఒక బంపర్ ప్లాన్ అని చెప్పొచ్చు. ఉచితంగా కాలింగ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ పొందుతారు.
జియో రూ.445 ప్లాన్ జియో రీఛార్జ్ ప్లాన్ తో మీరు ఓటిటి సబ్స్క్రిప్షన్ కూడా పొందాలంటే జియో రూ. 445 ప్లాన్ ఎంచుకోండి. ఇందులో జియో హాట్ స్టార్, సోనీ లైవ్, జీ5 పొందుతారు.
అయితే జియో అందిస్తున్న ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజుల పాటు వర్తిస్తుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయినా చేసుకోవచ్చు. ప్రతిరోజు 2gb డేటా పొందడంతో పాటు 100 ఎస్ఎంఎస్ లో ఉచితంగా పొందుతారు జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ 50జీబీ ఉచితం.
ప్రైవేట్ దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ అందిస్తున్న ఈ రెండు ప్లాన్స్ వినియోగదారులకు ఎంతోగానో ఉపయోగకరం, లాభదాయకం. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తో పాటు మీరు ఉచితంగా వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్, క్లౌడ్ స్టోరేజ్ కూడా పొందుతారు. ఓటిటిల కోసం అదనంగా డబ్బు ఖర్చు చేయకుండానే మీరు ఈ ప్లాన్స్ ఉచితంగా పొందవచ్చు.
































