భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకునేలా ఎప్పటికప్పుడు నూతన రీఛార్జ్ ప్లాన్లను పరిచయం చేస్తుంటుంది. అందులో భాగంగా ఇటీవల మరో కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. రోజుకు రూ.10 సమాన వ్యయంతో 98 రోజుల వ్యాలిడిటీ ఉన్న రూ.999 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ప్రతి రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 మెసేజులు, అపరిమిత కాలింగ్ లభిస్తాయి. అంతేకాదు అపరిమిత 5జీ ఇంటర్నెట్ యాక్సెస్ సేవను కూడా ఉచితంగా అందిస్తోంది. ఇక జియో టీవీ, జియో క్లౌడ్, జియో సినిమా వంటి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్లను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎయిర్‌టెల్, వీ తో పాటు రిలయన్స్ జియో కూడా జులై నెలలో టారీఫ్ రేట్లను గణనీయంగా 15 శాతం వరకు పెంచేశాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ రెండు విభాగాల్లోనే రేట్లను పెంచేడంతో చాలా మంది కస్టమర్లు ప్రభుత్వ రంగ ఆపరేటర్ అయిన బీఎస్‌ఎన్ఎల్ వైపు మొగ్గుచూపారు.