తక్కువ రీఛార్జ్‌తో JioBharat 4G ఫోన్.. 3 వేల ఫోన్ 1800కే

www.mannamweb.com


టెలికాం రంగంలో జియో నెట్ వర్క్ తో పెను సంచలనానికి తెరలేపింది రిలయన్స్ జియో. యూజర్లకు ఫ్రీగా సిమ్ తో పాటు డేటా, కాల్స్ అందించి టెలికాం దిగ్గజాలకు సవాల్ విసిరింది. దేశంలో కోట్లాది మంది యూజర్లను కలిగి ఉంది జియో. కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్లను సైతం మార్కెట్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. స్మార్ట్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫీచర్ ఫోన్లకు మంచి ఆదరణ లభించింది. ఈ క్రమంలో మరో కొత్త ఫీచర్ ఫోన్ ను లాంఛ్ చేసింది. జియో భారత్ జె1 4జీ ని విడుదల చేసింది జియో కంపెనీ. ఫీచర్ ఫోన్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో దీని ధర కేవలం రూ. 1,799 మాత్రమే ఉంది.
ధర:

ఇటీవల రిలయన్స్ జియో టారిఫ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. పెరిగిన రీఛార్జ్ ధరలతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ రీఛార్జ్.. ఎక్కువ బెనిఫిట్స్ కావాలనుకునే వారికి జియో భారత్ జె1 4జీ ఫోన్ చక్కటి పరిష్కారంగా మారనుంది. అత్యంత చీప్ 4జీ రీచార్జ్ ప్లాన్ అయిన రూ. 123 ప్లాన్ తో వస్తుంది. ఇది ప్రత్యేకంగా జియో భారత్ జె1 4జీ ఫోన్ కు మాత్రమే వర్తిస్తుంది. ఈ రీచార్జ్ ఫ్లాన్ ద్వారా 28 రోజుల పాటు 14 జీబీ డేటాను ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా డైలీ లిమిట్ లేకుండా డేటాను వినియోగించుకోవచ్చు.
ఫీచర్స్:

ప్రముఖ ఈకామర్స్ సంస్థలో జియో భారత్ జె1 4జీ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై 40 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 2999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు రూ. 1799కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ బ్లాక్, గ్రే కలర్స్ లో లభిస్తుంది. జియో భారత్ జె1 4జీ ఫోన్.. 2.8 అంగుళాల డిస్ ప్లే, 2500ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది జియో సినిమా ఇన్ స్టాలేషన్ తో వస్తుంది. అలాగే జియో టీవికి సపోర్టు చేస్తుంది. యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు. డిజిటల్ కెమెరాను అందించారు. జియో టీవి ద్వారా రీజనల్ లాంగ్వేజెస్ తో 455+ లైవ్ టీవీ ఛానల్స్ ని చూడొచ్చు. జియో చాట్ ద్వారా వాయిస్ మెసేజెస్, గ్రూప్ చాట్ చేసుకోవచ్చు.