తక్కువ ధరలో ల్యాప్‌టాప్ అందుబాటులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో జియో 2023లో జియోబుక్ 11 పేరుతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చింది. అయితే తాజాగా యూజర్ల కోసం ల్యాప్‌టాప్‌పై మంచి డిస్కౌంట్‌ను అందిస్తోంది.
ఆఫర్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను కేవలం రూ. 12,890కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్‌ఓ పాటు రిలయన్స్ డిజిటల్‌లో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే ఈ ల్యాప్‌టాప్ 4జీ మొబైల్ నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేసుకోవచ్చు. లేదా వైఫైకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. జియో ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో 11.6 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు.
ఈ ల్యాప్‌టాప్ బరువు కేవలం 990 గ్రాములు మాత్రమే కావడం విశేషం. ఇక జియోబుక్ 11 కేవలం బ్లూ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటలు పనిచేస్తుంది.
కాగా జియో ఈ ల్యాప్‌టాప్‌పై 12 నెలల వారంటీ అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, వాట్సాప్‌తో సహా మరెన్నో అప్లికేషన్‌లకు సపోర్ట్ చేస్తుంది. వెబ్‌క్యామ్, స్టీరియో స్పీకర్ల సహాయంతో వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసిన వారికి 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.