ఉద్యోగాల జాతర.. 55,000 పోస్టులకు నోటిఫికేషన్.. ఇదే కదా నిరుద్యోగులకు కావాల్సింది..

www.mannamweb.com


మీరు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హతతో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు ఇండియా పోస్ట్, ఐబీపీఎస్, ఎస్‌ఎస్‌సీ వంటి సంస్థలు జాబ్ నోటిఫికేషన్స్ జారీ చేశాయి.

ఈ రిక్రూట్‌మెంట్స్‌ డ్రైవ్స్‌తో ఏకంగా 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆ నోటిఫికేషన్స్ ఏవో చూద్దాం.

* ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్

ఇండియా పోస్ట్ జీడీఎస్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ నోటిఫికేషన్‌తో 35,000 ఖాళీలు భర్తీ కానున్నాయి. పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్‌ను ఆపరేట్ చేయడం తెలిసి ఉండాలి. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే అప్లికేషన్ ప్రాసెస్ జూన్ 25న ప్రారంభం కాగా, ఈ గడువు జులై 15న ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక పోర్టల్ indiapostgdsonline.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి.

* SSC MTS రిక్రూట్‌మెంట్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 8,326 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.18000 నుంచి రూ.22,000 మధ్య లభిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఎస్‌సీసీ పోర్టల్ ssc.gov.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ జులై 31న ముగుస్తుంది.

* ఐబీపీఎస్

ఐబీపీఎస్ 6,128 క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. బ్యాచిలర్ డిగ్రీ చదివినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికయ్యే అభ్యర్థులకు నెలకు జీతం రూ.19,900 నుంచి రూ.47,920 మధ్య లభిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయసు గరిష్టంగా 27 సంవత్సరాల లోపు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ ibpsonline.ibps.in విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు జులై 21న ముగుస్తుంది.

* IDBI బ్యాంక్ రిక్రూట్‌మెంట్

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) 31 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇటీవల రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు రూ. 1,000; SC, ST, PwD కేటగిరీ అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాలి.

* హెచ్‌ఎస్‌ఎస్‌సీ

హర్యాణా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (HSSC) 6,000 ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. ఇంటర్ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ hssc.gov.in విజిట్ చేయాలి.