ఆర్బీఐలో స్పెషలిస్ట్ పోస్టుల దరఖాస్తుకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 93 పోస్టులకు ఈ దఫా రిక్రూట్మెంట్ జరగనుంది. నెలకు రూ. 6లక్షల వరకు జీతం లభిస్తున్న ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డ్ (ఆర్బీఐఎస్బీ) ద్వారా ఆర్బీఐ రేటరల్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ని విడుదల చేసింది ఆర్బీఐ. ఈ దఫా రిక్రూట్మెంట్లో 93 పోస్టులను కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగాల గురించి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్బీఐ లేటరల్ రిక్రూట్మెంట్ 2026..
డేటా సైన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, రిస్క్ మేనేజ్మెంట్, ఎనలిటిక్స్, అలైడ్ డొమైన్స్ వంటి స్పెసిలైజ్డ్ పొజిషన్స్‌ని భర్తీ చేసేందుకు ఈ లేటరల్ రిక్రూట్మెంట్ని ఆర్బీఐ చేపట్టింది. ఆర్బీఐ నిఘా వ్యవస్థను, డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని సంస్థ ప్రయత్నిస్తోంది.
రిక్రూట్మెంట్- ఆర్బీఐ లేటరల్ 2026
పోస్టులు- ఫుల్ టైమ్ కాంట్రాక్ట్
వేకెన్సీ- 93
డిపార్ట్మెంట్లు- డీఐటీ, ప్రెమిసెస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్
అప్లికేషన్ మోడ్- ఆన్లైన్
సెలక్షన్ ప్రక్రియ- షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ
అధికారిక వెబ్సైట్- www.rbi.org.in
ఆర్బీఐ లేటరల్ రిక్రూట్మెంట్ 2026- వేకెన్సీలు..
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డీఐటీ)-
ఆర్బీఐ డిజిటల్ ఆపరేషన్స్‌కి సంబంధించిన కోర్ డేటా, ఇన్ఫ్రాస్టక్చర్పై ఈ ఉద్యోగాలు ఉంటాయి.
- డేటా సైంటిస్ట్- 2 పోస్టులు
- డేటా ఇంజినీర్- 2
- ఐటీ సెక్యూరిటీ ఎక్స్పర్ట్- 4
- ఐటీ సిస్టెమ్ అడ్మినిస్ట్రేటర్- 5
- ఐటీ ప్రాడక్ట్ అడ్మినిస్ట్రేటర్- 3
- ఏఐ/ఎంఎల్ స్పెషలిస్ట్- 3
- ఐటీ- సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్- 5
- నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్- 3
ప్రెమిసెస్ డిపార్ట్మెంట్-
ఆర్బీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిజికల్ అసెట్స్ విభాగంలో ఈ ఉద్యోగాలు ఉంటాయి.
- ప్రాజక్ట్ మెనేజర్- 5
డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్ విజన్ (డీఓఎస్)
ఓవర్సీస్ రిస్క్, కంప్లయన్స్, బ్యాంకింగ్ సిస్టెమ్లో ఫైనాన్షియల్ స్టెబిలుటీ వంటి ఉద్యోగాలు ఇందులో ఉంటాయి.
మార్కెట్ అండ్ లిక్విడిటీ రిస్క్ స్పెషలిస్ట్- 1
ఐటీ- సైబర్ సెక్యూరిటీ ఎనలిస్ట్- 13
ఆపరేషనల్ రిస్క్ ఎనలిస్ట్- 2
ఎనలిస్ట్ (క్రెడిట్ రిస్క్)- 2
ఎనలిస్ట్ (మార్కెట్ రిస్క్)- 2
రిస్క్ ఎనలిస్ట్- 5
అకౌంట్స్ స్పెషలిస్ట్- 5
రిస్క్ అసెస్మెంట్ అండ్ డేటా ఎనలిస్ట్- 2
పాలసీ రీసెర్చ్ ఎనలిస్ట్- 2
బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ రిస్క్ ఎనలిస్ట్- 6
డేటా ఇంజినీరింగ్-1- 1
డేటా ఇంజినీరింగ్-2- 1
డేటా ఎలనిస్ట్ (మైక్రో డేటా ఎనలిస్ట్)-1
బ్యాంకింగ్ డొమైన్ స్పెషలిస్ట్- 1
డేటా సైంటిస్ట్ (డేటా మాడలింగ్)- 2
బ్యాంక్ ఎగ్జామినర్ (లిక్విడిటీ రిస్క్)- 1
సీనియర్ బ్యాంక్ ఎగ్జామినర్ (లిక్విడిటీ రిస్క్)- 1
డేటా సేంటిస్ట్ (అడ్వాన్స్డ్ ఎనలిటిక్స్)– 4
క్రెడిట్ రిస్క్ స్పెషలిస్ట్- 4
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్- 2
ఆర్బీఐ లేటరల్ రిక్రూట్మెంట్ 2026- ముఖ్యమైన తేదీలు..
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ- 17 డిసెంబర్
అప్లికేషన్‌కి చివరి తేదీ- 6 జనవరి
అప్లికేషన్ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ- 6 జనవరి సాయంత్రం 6 గంటల వరకు
ఆర్బీఐ లేటరల్ రిక్రూట్మెంట్ 2026- జీతాలు..
పోస్టుల బట్టి నెలకు రూ. 3లక్షల నుంచి రూ. 6లక్షల వరకు జీతాలు ఉంటాయి. ఇతర ఆలొవెన్సులు కూడా ఉంటాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడాల్సి ఉంటుంది.
ఆర్బీఐ రిక్రూట్మెంట్ 2026..
ఆర్బీఐ లేటరల్ రిక్రూట్మెంట్కి దరఖాస్తు చేసుకోవాలని చూస్తున్న అభ్యర్థులు భారత పౌరసత్వాన్ని కలిగి ఉండాలి. 1962కి ముందు ఇండియాకు వచ్చిన నేపాల్, భూటాన్, టిబెట్ పౌరులు లేదా ఇతర దేశాల్లోని (లిస్ట్‌లో ఉన్న) భారత పౌరులు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా వీరు ఎలిజిబులిటీని ధ్రువీకరించుకోవాలి.
వయస్సు పరమితి, క్వాలిఫికేషన్, వర్క ఎక్స్‌పీరియెన్స్, జీతాలు వంటి వివరాలు తెలుసుకునేందుకు ఆర్బీఐ లేటరల్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ని చదవాల్సి ఉంటుంది.

































