Jobs: పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం.. ఎలా అప్లై చేయాలో తెలుసా?

Jobs: హెడ్డింగ్‌ చదవగానే ఎక్కడో తేడా ఉంది అనిపిస్తుందా.. పరీక్షలు రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం ఎవడు ఇస్తాడు అని అనుంకుంటున్నారా.. ఇవన్నీ ఫేక్‌..
అని లైట్‌ తీసుకుంటున్నారా.. కానీ మీరు అనునేది రాంగ్‌. నిజంగానే మీరు టాలెంటెండ్‌ అయితే. మీకు నచ్చిన రంగంలో మీకు పట్టు ఉంటే.. ఎలాంటి పరీక్షలు రాయకుండానే రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. అవేంటి.. వాటికి ఎలా అప్లయ్‌ చేసుకోవాలో ఇందులో తెలుసుకుందాం. ఈ మూడు వెబ్‌సైట్స్‌ ద్వారా ఎలాంటి పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందవచ్చు. మరి అవేంటో చూద్దాం.


మై గవర్నమెంట్‌ జాబ్స్‌.ఇన్‌(mygov.in)
ఈ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి.. అందులోని జాబ్‌ డిస్క్రిప్షన్‌ చదవండి. కంటెంట్‌ రైటర్, వెబ్‌ డెవలపర్, డేటా అనలిస్ట్‌తోపాటు అనేక విభాగాలకు చెందిన జాబ్స్‌ ఇందులో ఉంటాయి. క్వాలిఫికేషన్‌ బట్టి మనం ఈ వెబ్‌సైట్‌లోనే అప్లయ్‌ చేసుకుంటే.. మన అర్హతను బట్టి జాబ్‌ దొరుకుతుంది.
బిసిల్‌జాబ్స్‌.కామ్‌(beciljobs.co)
ఈ వెబ్‌సైట్‌లో కూడా మల్టీపుల్‌ జాబ్స్‌ ఉంటాయి. సైల్‌లోకి వెళ్లిన తర్వాత జాబ్‌ డిస్క్రిప్షన్‌ చెక్‌ చేసుకుని మనకు ఇంట్రెస్ట్‌ ఉన్న, సూటబుల్‌ జాబ్‌ సెలక్ట్‌ చేసుకుని అక్కడే అప్లయ్‌ చేసుకోవచ్చు. మన క్వాలిఫికేషన్స్‌ నచ్చితే జాబ్‌ దొరుకుతుంది. ఫ్రెషర్, ఎక్స్‌ఫీరియన్స్‌ జాబ్స్‌ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వేతనం రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది.

నీతి అయోగ్‌( niti aayog)
ఇక నీతి అయోగ్‌లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. ఇందులో ఫ్రెషర్స్‌తోపాటు, ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మన అర్హతను బంటి వేతనాలు ఉంటాయి. ఇందులో స్టార్టింగ్‌ సాలరీ రూ.30 వేల నుంచి ప్రారంభమవుతుంది. రూ.1లక్ష వరకు దొరుకుతుంది.
ఉద్యోగాలు రావడం లేదని బాధపడే విద్యావంతులు ఈ మూడు వెబ్‌సైట్స్‌ను తరచూ సెర్చ్‌ చేస్తూ ఉండాలి. ఇందులో ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే జాబ్స్‌ ఇస్తున్నారు.