Jobs: ఏరోస్పేస్‌ ల్యాబ్స్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.2 లక్షల వరకు జీతం

భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబొరేటరీస్‌ (NAL).. 30 సైంటిస్ట్‌/గ్రేడ్‌-4 పోస్టులను భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.


కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (CSIR) ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు సమయంలోనే ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను అప్‌లోడ్‌ చేయాలి.

విద్యార్హత: కెమిస్ట్రీ/ మెటీరియల్స్‌ సైన్స్‌/ మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌/ పాలిమర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ పాలిమర్‌ కెమిస్ట్రీ/ సిరామిక్స్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌/ రాడార్‌ ఇంజినీరింగ్‌/ ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌/ పవర్‌ ఎలక్ట్రానిక్స్‌తో ఎంఈ/ ఎంటెక్‌ లేదా పీహెచ్‌డీ పూర్తిచేయాలి. అలాగే, డిజైన్, మెకానికల్‌ సిస్టమ్స్‌ మెయింటెనెన్స్, ఫ్యాబ్రికేషన్‌/ సీ, సీ++ ప్రోగ్రామింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌/ మెషీన్‌ డిజైన్‌/ మెకానికల్‌ డిజైన్‌ ఇంజినీరింగ్‌/ క్యాడ్‌ టూల్స్‌/ థర్మల్‌ ఇంజినీరింగుల్లో ఏదో ఒక దాంట్లో అనుభవం ఉండాలి.

వయసు: 32 సంవత్సరాలు మించకూడదు.

వేతన శ్రేణి: రూ.67,700- రూ.2,08,700. మూల వేతనంతోపాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ, ఎల్‌టీఏ, వైద్య ఖర్చులు, చిల్డ్రన్‌ ఎడ్యుకేషన్‌ అలవెన్సులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని సదుపాయాలూ వర్తిస్తాయి.

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 3

వెబ్‌సైట్‌: https://www.nal.res.in