10th అర్హతతో ఏపీఈఆర్‌సీలో ఉద్యోగాలు..డైరక్ట్ రిక్రూట్ మెంట్..నెలకు రూ.63 వేల జీతం
హైదరాబాద్‌లోని ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(APERC) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో 6 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
10వ తరగతి ఉత్తీర్ణత ఆధారంగా వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 24 దరఖాస్తులకు చివరితేది. ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే ముందు ఈ ముఖ్య వివరాలను చూడండి.
పోస్టుల వివరాలు
ఆఫీస్ సబార్డినేట్: 06 పోస్టులు
అర్హత
10వ తరగతి ఉత్తీర్ణత. తెలుగు, ఇంగ్లిష్ చదవడం, రాయడం, శారీరక దార్ఢ్యం, ద్విచక్ర వాహన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
21 – 35 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం
నెలకు రూ.20,600 నుంచి రూ.63,660.
దరఖాస్తు విధానం
ఆఫ్‌లైన్ ద్వారా అప్లయ్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు
రూ.500. రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తులతు తుది గడువు
24 జనవరి, 2024.
దరఖాస్తు విధానం
ఆఫ్‌లైన్ దరఖాస్తులను కమిషన్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, రెడ్ హిల్స్, ఖైరతాబాద్, హైదరాబాద్ అడ్రెస్ కు పంపాలి. దరఖాస్తుకు టెన్త్ సర్టిఫికెట్ కాపీ, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్, రీసెంట్ 3 పాస్ పోర్ట్ సైజ్ ఫోటో గ్రాఫ్స్ తో పాటు కమ్యునిటీ డిక్లరేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలను జతపర్చాలి. దరఖాస్తు ఫారమ్ లను https://aperc.gov.in/admin/upload/Notification_OS_10Jan24.pdf పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ – https://aperc.gov.in/