బ్యాంక్ ఆఫ్ బరోడా మరోసారి నిరుద్యోగులకు శుభవార్త ప్రకటించింది. పలు విభాగాల్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు 2025 అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లు, కార్పొరేట్ ఆఫీసులు, జోనల్ సెంటర్లు వంటి వివిధ విభాగాల్లో నియమించబడతారు. భారీ జీతంతో పాటు స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడే ఆ అవకాశాన్ని ఆసక్తి గల అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవచ్చు.
అర్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ, సీఏ (CA), సీఎంఏ (CMA), సీఎస్ (CS), సీఎఫ్‌ఏ (CFA), డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, కార్పొరేట్ లెండింగ్, రిస్క్ మేనేజ్మెంట్, క్రెడిట్ అసెస్‌మెంట్ వంటి విభాగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థులు మెరుగైన అవకాశాలను పొందగలరు.
మొత్తం ఖాళీలు..
50
ఖాళీల వివరాలు..
- మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): 01 పోస్ట్
- సీనియర్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): 25 పోస్టులు
- చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్): 02 పోస్టులు
- సీనియర్ మేనేజర్ (సీ & ఐసీ రిలేషన్‌షిప్ మేనేజర్): 16 పోస్టులు
- చీఫ్ మేనేజర్ (సీ & ఐసీ రిలేషన్‌షిప్ మేనేజర్): 06 పోస్టులు
ఈ పోస్టులు బ్యాంక్ యొక్క కార్పొరేట్ బ్యాంకింగ్, రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్, క్రెడిట్ విశ్లేషణ వంటి విభాగాల్లో ఉంటాయి.
వయో పరిమితి..
అభ్యర్థుల వయస్సు 25 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ప్రభుత్వ నియమావళి ప్రకారం వయస్సులో సడలింపులు ఉన్నాయి:
ఓబీసీలకు: 3 సంవత్సరాలు
ఎస్సీ/ఎస్టీలకు: 5 సంవత్సరాలు
దివ్యాంగులకు: 10 సంవత్సరాలు
ఎంపిక విధానం..
ఎంపిక ప్రక్రియ ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరగనుంది. పరీక్షా సిలబస్, సెంటర్ వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల కానున్నాయి.
జీతం..
మేనేజర్: రూ.64,820 – రూ.93,960
సీనియర్ మేనేజర్: రూ.85,920 – రూ.1,05,280
చీఫ్ మేనేజర్: రూ.1,02,300 – రూ.1,20,940
అదనంగా, డిఏ (Dearness Allowance), హెచ్‌ఆర్‌ఏ (House Rent Allowance), మెడికల్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, పెన్షన్, బోనస్, గ్రాచ్యుటీ వంటి అన్ని సౌకర్యాలు కూడా అందిస్తారు.
దరఖాస్తు రుసుము..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: రూ.850
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులు: రూ.175
చెల్లింపు డెబిట్/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ..
అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ను సందర్శించి ఆన్ లైన్ లో చేయాలి.
దరఖాస్తు విధానం..
Careers → Current Opportunities” విభాగంలోకి వెళ్లండి.
సంబంధిత పోస్టును ఎంపిక చేసి “Apply Now” పై క్లిక్ చేయండి.
అవసరమైన వివరాలు నమోదు చేసి, పత్రాలు (ఫోటో, సంతకం, సర్టిఫికేట్లు) అప్‌లోడ్ చేయండి.
ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయండి.
ఫైనల్ సబ్మిషన్ తర్వాత దరఖాస్తు కాపీని సేవ్ చేసుకోండి.
దరఖాస్తు గడువు..
దరఖాస్తు ప్రారంభం: 10 అక్టోబర్ 2025
దరఖాస్తు ముగింపు: 30 అక్టోబర్ 2025
పరీక్ష/ఇంటర్వ్యూ తేదీలు: త్వరలో ప్రకటించబడతాయి
































