భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) మరో జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. పైప్‌లైన్స్ డివిజన్ పరిధిలోని 5 రీజియన్‌లలో 473 టెక్నికల్/ నాన్-టెక్నికల్ ట్రేడుల్లో అప్రెంటిస్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరి ఈ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్, అర్హత, లాస్ట్ డేట్ తదితర వివరాలు చూద్దామా..
మొత్తం 473 ఖాళీలు ఉండగా.. మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్/ ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి. 12వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఆన్ లైన్ విధానంలో చేసుకోవాలి.
ఈ పోస్టులకు అప్లై చేసే వారి వయసు 12.01.2024 నాటికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఫిబ్రవరి 1, 2024గా నిర్ణయించారు. అప్లై చేసుకున్న వారికి ముందుగా రాత పరీక్ష నిర్వహించి.. అందులో సెలెక్ట్ అయిన వారికి ఆ తర్వాత వైద్య పరీక్ష చేస్తారు. ఆ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. వీటన్నింటి తర్వాత చివరకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను అప్రెంటిస్ గా తీసుకుంటారు.
ఆన్ లైన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 18వ తేదీన రాత పరీక్ష ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలకు https://iocl.com/ వెబ్‌సైట్ సందర్శించండి.
????Job Alerts : వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూప్ లో చేరగలరు……