డిగ్రీతో బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాలు.. మంచి జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోండి.

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 12.

పోస్టుల సంఖ్య: 10 (జూనియర్ ఎగ్జిక్యూటివ్).

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/బోర్డు నుంచి సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి.

కావాల్సినవి: ఐఐబీఎఫ్ లో బ్యాంకింగ్ & ఫైనాన్స్​లో డిప్లొమా, ఎంఏ ఎకనామిక్స్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్, సీఎఫ్ఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

గరిష్ట వయోపరిమితి: 2025, నవంబర్ 1 నాటికి 28 ఏండ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్​మన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 28.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

లాస్ట్ డేట్: డిసెంబర్ 12.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఎగ్జామినేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పూర్తి వివరాలకు iibf.org.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.