మాజీ మంత్రి జోగి రమేష్ కు ఊహించని పరిణామం ఎదురైంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల భూ వివాదంలో ముగ్గురిపై వేటు పడింది. కలెక్టర్ కు తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు కలెక్టర్.
తప్పుడు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసినట్టు ప్రాథమిక నిర్ధారణ కావటంతో ముగ్గురిపై సస్పెన్షన్ వేశారు.
డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, సర్వేయర్ రమేష్, గ్రామ సర్వేయర్ దేదీప్య పై వేటు వేశారు. నిషేధిత అగ్రిగోల్డ్ భూములకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సర్వే నంబరు ధ్రువీకరణ పత్రాలు ఇచ్చినట్టు విచారణలో గుర్తించటంతో చర్యలు తీసుకున్నారు కలెక్టర్.
ఇది ఇలా ఉండగా… కాకినాడ వైసీపీ కార్యాలయం కి నోటీసులు ఇచ్చారు కార్పొరేషన్ అధికారులు. అక్రమ నిర్మాణాలు కు వారం రోజుల్లోపు సమాధానం చెప్పాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబుకు నోటీసులు ఇచ్చారు. వైసీపీ కార్యాలయం నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని, ఎందుకు తొలిగించకూడదో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు అధికారులు.